ఆయన అభిప్రాయం ప్రకారం, ఒంటరితనం అనేది బాధకరమైనది కాదు.. అది మనల్ని మనం అర్థం చేసుకునే అవకాశం. చాలా మంది ఒంటరిగా ఉండడాన్ని నెగిటివ్‌గా భావిస్తారు. కానీ రామ్ దాన్ని ఒక వరంలా చూస్తారు. తనతో తాను గడిపే క్షణాలు తనకు మానసికంగా బలాన్నిస్తాయని, ఆ సమయంలోనే కొత్త ఆలోచనలు పుడతాయని ఆయన చెప్పారు. ఈ దృక్పథం ఆయన వ్యక్తిత్వాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఇక అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పెళ్లి విషయంపై కూడా రామ్ పరోక్షంగా స్పందించారు. తన జీవితంలోకి సరైన వ్యక్తి వస్తే ఆమెతో సమయాన్ని పంచుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే, ఒకవేళ అలాంటి వ్యక్తి రాకపోయినా తాను ఒంటరిగానే సంతోషంగా జీవించగలనని స్పష్టంగా చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఆయనలోని ఆత్మవిశ్వాసాన్ని, జీవితం పట్ల ఉన్న స్పష్టతను ప్రతిబింబిస్తున్నాయి.
ప్రస్తుతం రామ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానుల్లో విభిన్న అభిప్రాయాలకు దారి తీస్తున్నాయి. కొందరు ఆయన ఆలోచనలను అభినందిస్తుండగా, మరికొందరు ఆయన త్వరలోనే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఏదేమైనా, తన జీవనశైలి, ఆలోచనలతో రామ్ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి