రెండు తెలుగు రాష్ట్రాలలో ఫోక్, సినిమా పాటలతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది సింగర్ మంగ్లీ. అయితే తాజాగా ఒక భారీ ఆర్థిక వివాదంలో చిక్కుకున్నట్లు వినిపిస్తున్నాయి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైన వ్యవహారంలో రోజుకోక మలుపు తిరుగుతోంది. ముఖ్యంగా మంగ్లీ ఆరోపణలు కౌంటర్లు ఇస్తూ ఉన్నప్పటికీ రోజురోజుకి ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రముఖ అడ్వకేట్ సుబ్బారావు పంజాగుట్ట పోలీసులకు మంగ్లీ పైన ఫిర్యాదు చేశారు. మంగ్లీతో పాటుగా ఆమె సోదరుడు పైన పలు రకాల ఆరోపణలు చేశారు.



 అడ్వకేట్ సుబ్బారావు ప్రకారం.. రమావత్ మధు అనే వ్యక్తి గోకుల్ నంద ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సింగర్ మంగ్లీ పేరును ఉపయోగించుకొని మైక్రో ఫైనాన్స్ కార్యక్రమాలు నిర్వహించారని, నెలకు నాలుగు నుంచి ఐదు శాతం వరకు వడ్డీ , స్థలలు రిజిస్ట్రేషన్ వంటి హామీలు ఇచ్చి రూ. 150 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారంటూ ఆరోపణలు చేశారు. తన వ్యక్తిగతంగా దాదాపుగా రూ .10 కోట్ల వరకు మోసపోయానంటూ సుబ్బారావు ఫిర్యాదులో తెలియజేశారు. తన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే తమను బెదిరిస్తున్నారని ఫిర్యాదులో తెలియజేశారు




మంగ్లీ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించి తనకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదంటూ తెలిపారు. కావాలనే తన ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఇలాంటి పనులు చేస్తున్నారంటు అడ్వకేట్ పై కౌంటర్ కంప్లైంట్ చేసింది మంగ్లీ. తన పైన సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం పెరుగుతూ ఉండడంతో నేరుగా డీజీపీని కలిసి ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులో కీలకమైన నిందితులుగా మధు, బాలాజీ నాయక్, భరత్ చౌహన్ వంటి పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. వీరి మీద సుమారుగా 62 కేసులు కూడా నమోదు అయినట్టు సమాచారం. పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి పరారయ్యారని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ కేసును సిఐడికి బదిలీ చేసి దర్యాప్తు కొనసాగించేలా చేస్తున్నారు.


అయితే పరారీలో ఉన్న మధు మాత్రం ఒక వీడియోను విడుదల చేస్తూ ఆ వీడియోలో అడ్వకేట్ సుబ్బారావు చెప్పిన ఆరోపణలు నిజాలు కావని తాను మోసపోయానని తెలిపారు. హిమాకాంత్ రెడ్డి అనే వ్యక్తి దగ్గరే డబ్బులు అన్ని ఉన్నాయంటూ ఆరోపణలు చేశారు. ఆ డబ్బులు బినామీల మీద ఉంచారంటు ఆరోపణలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: