టాలీవుడ్ లో వినిపిస్తున్న ప్రకారం.. ప్రముఖ ఓటీటి దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్ ఈ చిత్రం కోసం పర్ఫామెషన్స్ బేస్డ్ ఒప్పందాన్ని ప్రతిపాదించినట్లుగా వినిపిస్తోంది. సాధారణంగా ఒక సినిమా హిట్, ఫ్లాప్ అని సంబంధం లేకుండా విడుదలకు ముందే భారీ ధరకు ఓటిటి సంస్థలు రైట్స్ కొనుగోలు చేస్తుంటాయి. కానీ స్వయంభు సినిమా విషయంలో నెట్ ఫ్లిక్ సరికొత్త రూల్ ని తెరమీదకి తీసుకువచ్చింది. అదేమిటంటే ఈ సినిమా థియేటర్లలో ఎంత నెట్ కలెక్షన్ సాధిస్తుందో అందులో సరిగ్గా సగం మొత్తం 50% డిజిటల్ రైట్స్ కింద చెల్లిస్తుందని సమాచారం.
అంటే బాక్స్ ఆఫీస్ వద్ద రూ.100 కోట్ల రూపాయలు వసూలు చేస్తే ఓటీటి హక్కులు రూ .50 కోట్లకు దక్కుతుంది. ఒకవేళ రూ.150 కోట్లు దాటితే మరింత ఓటీటి ధర పెరిగే అవకాశం ఉన్నది. అంటే ఇది ఒకరకంగా నిర్మాతలకు కాస్త ఊరట కలిగించే విషయమని చెప్పవచ్చు. కంటెంట్ మీద నమ్మకం ఉండి బ్లాక్ బాస్టర్ అయితే ఎవరు ఊహించని విధంగా అధిక మొత్తంలో ఆదాయం లభిస్తుంది. ఒకవేళ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతే ఓటిటి ఆదాయం కూడా తగ్గుతుంది. అయితే ఇటీవల కాలంలో భారీ ధరకు పలు సినిమాలను కొనుగోలు చేసిన ఓటీటి సంస్థలు వ్యూస్ రాబట్టలేకపోతుండడంతో ఇలాంటి పద్ధతిని కొనసాగించబోతున్నట్లు వినిపిస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి