తాజా సమాచారం ప్రకారం, ఈ హిట్ జంటను మళ్ళీ కలిపే బాధ్యతను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక కొత్త దర్శకుడు చెప్పిన అద్భుతమైన ప్రేమకథకు త్రిష, సిద్ధార్థ్ అయితేనే పర్ఫెక్ట్ అని మేకర్స్ భావిస్తున్నారట. ప్రస్తుతం ప్రాథమిక చర్చలు జరుగుతుండగా, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వీరిద్దరి కాంబినేషన్ అంటేనే మ్యూజికల్ హిట్ అనే నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది.ప్రస్తుతం త్రిష కెరీర్ టాప్ గేర్‌లో ఉంది. మెగాస్టార్ చిరంజీవి సరసన సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’లో ఆమె నటిస్తోంది.
అలాగే సూర్యతో కలిసి ఆర్.జె. బాలాజీ దర్శకత్వంలో ‘కరుప్పు’ అనే మూవీలో నటిస్తోంది. ఈ సినిమా మే నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. విజయ్ దళపతి, అజిత్ వంటి టాప్ స్టార్స్ సినిమాలతో బిజీగా ఉంటూనే, సిద్ధార్థ్‌తో క్లాసిక్ లవ్ స్టోరీకి ఓకే చెప్పడం ఆమె వైవిధ్యమైన ప్లానింగ్‌కు నిదర్శనం.దాదాపు 21 ఏళ్ల క్రితం మొదలైన వీరి సినీ ప్రయాణం, ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త మలుపు తిరగబోతుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. సిరి - సంతోష్ మళ్ళీ సెట్స్ మీద కనిపిస్తే, థియేటర్లలో నాటి నాస్టాల్జియా రీలోడ్ అవ్వడం ఖాయం. దిల్ రాజు బ్యానర్ అంటే మినిమం గ్యారెంటీ ఉండటంతో, ఈ ప్రాజెక్టుపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి