అయితే ఈ రూమర్స్ పైన రాకా టీమ్ తాజాగా క్లారిటీ ఇచ్చింది. రాకా సినిమా నుంచి దీపికా తప్పుకుందనే వార్తలలో ఎలాంటి నిజం లేదని ఈ సినిమాలో ఆమె పాత్రే చాలా కీలకమని, స్క్రీన్ స్పేస్ తగ్గించారనే ప్రచారంలో కూడా ఎటువంటి వాస్తవం లేదంటు తేల్చి చెప్పింది టీమ్. షూటింగ్ అంతా కూడా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ముందుకు సాగుతుందని ఎవరు కూడా అనవసరమైన రూమర్స్ నమ్మవద్దు అంటూ అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ కోసం అవసరమైన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నామని యాక్షన్ సీక్వెన్స్ లను కూడా పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఇక ఈ సినిమాలో దీపికా తో పాటు రష్మిక, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ నటించబోతున్నట్లు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరందరూ అతిథి పాత్రలో కనిపిస్తారా? లేక పూర్తిస్థాయిలో పాత్రల్లో కనిపిస్తారా అనే విషయం మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. రాకా సినిమా కోసం అల్లు అర్జున్ మేకప్ కోసమే సుమారుగా 3 నుంచి 4 గంటల పాటు సమయం పడుతోందట, అంతేకాకుండా ప్రయాణం కూడా ప్రతిరోజు చేయడం ఇబ్బందిగా మారడంతో అల్లు అర్జున్ ముంబైకి షిఫ్ట్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి