దిల్ రాజుకు ఉన్న అతిపెద్ద బలం ఆయన ‘జడ్జిమెంట్’. ఒక సినిమా భవితవ్యం థియేటర్లలో కాదు, ఎడిటింగ్ రూమ్‌లోనే 90 శాతం తెలిసిపోతుందని ఆయన నమ్ముతారు.“సినిమా చూస్తున్నప్పుడు ఎడిటింగ్ సమయంలోనే నాలో చిన్న సందేహం వచ్చినా, అది సినిమా ఫ్లాప్ అయ్యే సంకేతమని నాకు అర్థమైపోతుంది” అని ఆయన కుండబద్దలు కొట్టారు.తన జడ్జిమెంట్ ఎంత పక్కాగా ఉంటుందో చెప్పడానికి ప్రభాస్ హీరోగా నటించిన ‘మున్నా’ చిత్రాన్ని ఉదాహరణగా చెప్పారు.సినిమా విడుదలైన రోజున 3 గంటల షో చూడగానే ‘మున్నా’ పక్కా ఫ్లాప్ అవుతుందని దిల్ రాజుకు అర్థమైపోయింది.వెంటనే డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్ చేసి, సినిమా నిరాశపరుస్తుందని నిజాయితీగా చెప్పారు. అయితే, తాను వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చి తన ‘దిల్’ ఎంత పెద్దదో నిరూపించుకున్నారు.అదేవిధంగా మణిరత్నం గారి ‘చెలియా’ విషయంలోనూ విడుదలకు ముందే అది ‘బ్యాడ్ ఫిల్మ్’ అని గుర్తించి డిస్ట్రిబ్యూటర్లను హెచ్చరించడం ఆయన వృత్తిపరమైన నిబద్ధతకు నిదర్శనం.
కెరీర్ ప్రారంభంలో ‘దిల్’ తర్వాత వచ్చిన ‘నిన్నే ఇష్టపడ్డాను’, ‘జై’ చిత్రాలు దిల్ రాజును ఆర్థికంగా దెబ్బతీశాయి. ఆ సమయంలోనే అల్లు అర్జున్ - సుకుమార్ కలయికలో వచ్చిన ‘ఆర్య’ చిత్రం ఆయనను నిలబెట్టింది. ఆ విజయం ఇచ్చిన ఊపుతోనే నేడు టాలీవుడ్‌ను శాసించే స్థాయికి చేరుకున్నారు.పరిశ్రమలో 90 శాతం నష్టపోయేది డిస్ట్రిబ్యూటర్లేనని దిల్ రాజు గట్టిగా నమ్ముతారు.సంవత్సరానికి వంద సినిమాలు కొనే డిస్ట్రిబ్యూటర్లు 80 సినిమాల్లో నష్టపోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అందుకే డిస్ట్రిబ్యూటర్లను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే దిల్ రాజు సహించరు. కేవలం డబ్బు వెనుక పరుగెత్తకుండా, సినిమా విజయం ద్వారా వచ్చే డబ్బునే తాను ఆస్వాదిస్తానని ఆయన స్పష్టం చేశారు.ప్రస్తుతం దిల్ రాజు తన దృష్టిని బాలీవుడ్ పై మళ్ళించారు. బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఆయన నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో దిల్ రాజు బ్రాండ్ గ్లోబల్ రేంజ్‌కు వెళ్లడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి