తాజాగా ఈ ప్రాజెక్టు గురించి వినిపిస్తున్న కొన్ని క్రేజీ లీక్స్ మాత్రం సినిమా అంచనాలను పెంచేసేలా కనిపిస్తున్నాయి. ఈ సీక్వెల్ లో ఒక పవర్ఫుల్ పాత్ర ఉంటుందని అది కూడా క్లైమాక్స్ లో వస్తుందని సమాచారం. ఈ పాత్రలో తమిళ హీరో శింబు నటించే అవకాశం ఉన్నట్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ శింబు కూడా ఈ సినిమాలో భాగమైతే మాత్రం తమిళ మార్కెట్లో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొదటి భాగం చివరిలో ప్రభాస్ పాత్రను కర్ణుడిగా చూపించి పెద్ద సర్ప్రైసే ఇచ్చారు.
అలా కొనసాగింపే సీక్వెల్ కు కర్ణ 3102 బిసి అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదటి భాగం కల్కి ఆగమనాన్ని చూపిస్తే ఇప్పుడు రెండవ భాగంలో పూర్తిగా కర్ణుడి గత చరిత్ర, పురాణాలలో నాటి కథాంశం పైన ప్రత్యేక దృష్టి సాధించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక షెడ్యూల్ కోసం హైదరాబాదులో భారీ సెట్ నిర్మిస్తున్నట్లు వినిపిస్తోంది. ఈ సెట్లో ప్రభాస్ ,అమితాబచ్చన్, కమలహాసన్ మధ్య వచ్చే సీన్స్ యాక్షన్ ఎపిసోడ్లను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. కల్కి 2 లో పురాణాలకు సంబంధించిన సన్నివేశాలే ఎక్కువగా ఉండబోతున్నాయట. ఇవి ఆడియన్స్ కి ఒక అద్భుతమైన విజువల్ ట్రీట్ లా కనిపిస్తాయని సమాచారం. మరి కల్కి 2 సినిమా పైన అప్డేట్లపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి