స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాటలో భాగంగా శ్రీ తేజ్ అనే చిన్నారి తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. దీంతో కొన్ని నెలల నుంచి ఐసీయూలో చికిత్స తీసుకున్నారు ఇప్పుడు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న శ్రీతేజ్ కుటుంబానికి అల్లు అర్జున్ కుటుంబం అండగా ఉన్నది. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, అల్లు అరవింద్ శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించారు. నిన్నటి రోజున స్నేహ రెడ్డి, అల్లు అరవింద్ శ్రీ తేజ్ ఇంటికి వెళ్లి తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.


పుష్ప 2 విడుదల సందర్భంగా ప్రీమియర్ షో సమయం లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో శ్రీ తేజ్, అతని తల్లి రేవతి అక్కడే మరణించగా శ్రీ తేజ్ మాత్రం తీవ్ర గాయాలతో అపస్మారకస్థితిలోకి వెళ్లారు. అలా ఆసుపత్రిలో కొన్ని నెలల పాటు కోమాలో ఉన్న శ్రీ తేజ్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అల్లు అర్జున్. అంతేకాకుండా శ్రీ తేజ్ కు చికిత్స కోసం అవసరమైన ఖర్చులతో పాటు అతని కుటుంబానికి సైతం అండగా ఉంటామని హామీ ఇచ్చారు.



ఇప్పటికే ఆ చిన్నారి పేరు మీద రూ .2కోట్ల రూపాయల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ వేసినట్లు  తెలుస్తోంది. శ్రీతేజ్ చెల్లెలితో అల్లు అరవింద్ ,స్నేహ రెడ్డి కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడారు. పిల్లల భవిష్యత్తు గురించి అడిగి తెలుసుకుని, వారి చదువుకి అయ్యే ఖర్చు కూడా తామే భరిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు కేవలం ఆర్థిక సహాయమే కాకుండా స్వయంగా శ్రీ తేజ్ కుటుంబం దగ్గరికి వెళ్లి మరి పరామర్శించడం ద్వారా ఆ కుటుంబంలో కూడా మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: