నందమూరి బాలకృష్ణ హంసానందినితో స్పెషల్ సాంగ్ కు డాన్స్ చేసిన సినిమాలు బాగా హిట్ కావడంతో ఆ పెయిర్ పై మంచి క్రేజ్ ఉంది. అయితే ఈసారి సినిమా కోసం కాకుండా ఒక ప్రయివేట్ పార్టీలో హంసనందని బాలయ్యతో చిందులు వెయబోతోంది. అది కూడ  బాలకృష్ణ పుట్టినరోజునాడు ఏర్పాటు చేసిన పర్సనల్ పార్టీ కావడం విశేషం.

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం బాలకృష్ణ పుట్టినరోజు ఈసారి అమెరికాలో జూన్ 10న గ్రాండ్ గా చేయటానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నట్లు సమాచారం. అమెరికాలో   నందమూరి ఫ్యాన్స్ ఆయన పుట్టినరోజునాడు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బాలయ్యని ఆహ్వానిస్తున్నారు. 

కాలిఫోర్నియాలో ఈ బర్తేడే పార్టీ జరగా బోతోంది ఈ పోగ్రాం ద్వారా  కొంత ఫండ్ పోగుచేసి బసవతారకం కాన్సర్ హాస్పటిల్ కు ఇవ్వడానికి బాలకృష్ణ అభిమానులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసారు. అయితే  ఈ పోగ్రామ్ లో భాగంగా హంసానందిని స్పెషల్ డాన్స్ పోగ్రాం కూడ  ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ పార్టీలో  బాలయ్య ఆమెతో కలిసి డాన్స్ చేసి తన అభిమానులకు మంచి జోష్ ను ఇవ్వబోతున్నాడు.

అదేరోజు బాలకృష్ణ తన గౌతమీపుత్ర శాతకర్ణి’ ఫస్ట్ లుక్ ని కూడ విడుదల చేస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం మొరాకో లో అత్యంత వేగవంతంగా జరుగుతున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ షూటింగ్ లో బిజీగా ఉన్న బాలయ్య ఆ షూటింగ్ కార్య క్రమాలు ముగించుకుని ఆ తరువాత ఈఅమెరికా ప్రయాణం ఎర్పట్టు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వారంతో అక్కడ షెడ్యూల్ పూర్తి చేసుకుని  బాలయ్య హైదరాబాద్ తిరిగి వస్తాడని టాక్. బాలయ్యకు ఐటమ్ సాంగ్స్ విషయంలో లక్కీ గర్ల్ గా పేరుగాంచిన హంసనందని ఇప్పుడు ఏకంగా బాలకృష్ణతో స్టేజ్ షో చేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: