తెలుగు ఇండస్ట్రీలో దర్శకులుగా సెటిల్ కవాలని వచ్చిన వారు హీరోలు అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకప్పుడు మాస్ మహరాజ రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోగా సెటిల్ అయ్యాడు. ఇదే లీస్టులో నాని, రాజ్ తరుణ్ లు కూడా ఉన్నారు..అయితే ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీలో తమ సత్తా చాటుతూ మినిమం గ్యారెంటీ హీరోలుగా ఇప్పుడు వీరు కొనసాగుతున్నారు. గతంలో బాపు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన హీరో నాని అష్టాచమ్మ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత వచ్చిన సినిమాలు పెద్ద విజయాలు నమోదు చేసుకోక పోయినా..గత సంవత్సరం వచ్చిన భలె భలె మగాడివోయ్ చిత్రం సూర్ డూపర్ హిట్ అయ్యింది..ఆ తర్వాత కృష్ణ గాడి వీరప్రేమ గాధ చిత్రం కూడా మంచి హిట్ కావడం రీసెంట్ గా వచ్చిన నాని చిత్రం జెంటిల్ మాన్ కూడా పాజిటీవ్ టాక్ తెచ్చుకోవడంతో నాని స్టార్ ఇమేజ్ అమాంతంగా పెరిగిపోయింది.

హీరో నాని


 ఇప్పుడు నాని దర్శకత్వ భాద్యతలు తీసుకున్నారట...అది కూడా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృస్టించిన బాహుబలి 2 కి సంబంధించింది. ఇది వింటుంటే ఆశ్చర్యపోవడం ఖాయమని అనుకుంటున్నారా..! అబ్బే అలాంటిదేమీ లేదు ఇప్పటికే ఎన్నో అద్భుతాలు సృష్టించిన బాహుబలి సెట్లో ఇలాంటి విచిత్ర సంఘటన జరిగింది. ప్రస్తుతం  రామోజీ ఫిలిం సిటీలో ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్ జరుగుతోంది. దాని సమీపంలో నానీ కొత్త చిత్రం షూటింగ్ జరుగుతుంది.

నానితో ముచ్చటిస్తున్న రాజమౌళి


ఇక బాహుబలి సెట్స్ లోకి అకస్మాత్తుగా నాని రావడాన్ని చూసి దర్శకధీరుడు రాజమౌళి అభిమానంతో తాను షూట్ చేస్తున్న కొన్ని పోరాట సన్నివేశాలు నాని ని దర్శకత్వం వహించమని అడిగాడట..అంతే మనోడికి పట్టరాని ఆనందంతో వెంటనే మెగా ఫోన్ అందుకొని స్టార్ట్ కెమెరా...యాక్షన్ అని డైరెక్ట్ చేశాడు. నాని డైరెక్ట్ చేస్తున్న స్టిల్ ను బాహుబలి యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వాస్తవానికి నాని డైరెక్షన్ కొత్త విషయం ఏమీ కాదు అసలు ఆ ఫీల్డ్ నుంచి వచ్చిన అనుభవంతో ఉండటంతో మనడో చేసిన డైరెక్షన్ చూసి అందరూ షభాష్ అని మెచ్చుకున్నారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: