యోగా బ్యూటీ అనుష్క ఇఫ్పుడు హైదరాబాద్ లో రోజు ఉదయం మాస్క్ వేసుకుని సైకిల్ తోక్కుతోంది అంటూ వార్తలు హడావిడి చేస్తున్నాయి. అంతేకాదు అనుష్క ఏకంగా రోజుకు 20కిలో మీటర్లు సైకిల్ తొక్కాలని ఒక టార్గెట్ తనకు తాను సెట్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అనుష్క ఈవిధంగా కష్టపడటం ‘బాహుబలి 2’ కోసం అని అంటున్నారు. ‘సైజ్ జీరో’ కోసం అనుష్క పెంచుకున్న శరీరం తిరిగి తగ్గించుకునే విషయంలో అనుష్క సమస్యలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. అందమైన రాజకుమారి దేవసేనగా అనుష్క ‘బాహుబలి 2’ లో కనిపించ వలసి వస్తున్న నేపధ్యంలో దర్శకుడు రాజమౌళి అనుష్కకు తన వొళ్ళు తగ్గించుకునే విషయంలో ఇచ్చిన ఫైనల్ గడువు సెప్టెంబర్ నెలా ఖరుకు పూర్తి అవుతుంది అని వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం రాజమౌళి తీస్తున్న ‘బహుబలి 2’ క్లైమాక్స్ కు సంబంధించిన వార్ సీన్స్ షూటింగ్ ఎట్టి పరిస్థితులలోను సెప్టెంబర్ నెలాఖరుకు పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో పరుగులు తీస్తున్నాడు రాజమౌళి. అక్టోబర్ నుండి ప్రభాస్ రానా అనుష్కల పై కొన్ని కీలక సన్నివేసాలతో పాటుగా ప్రభాస్ అనుష్కల మధ్య ప్రేమ సన్నివేసాలు షూట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీపడని రాజమౌళి అనుష్కకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన నేపధ్యంలో ‘బాహుబలి 2’ షూటింగ్ కు ఏదో విధంగా అందుకోవడానికి డాక్టర్స్ సలహాతో అనుష్క ఇలా రోజుకి 20కిలో మీటర్లు తోక్కేసాహాసం చేస్తోంది అంటూ వాతలు వస్తున్నాయి. వెయిట్ తగ్గడం కోసం ఇన్నాళ్లు చేసిన యోగా, జిమ్‌లో ఇతర వ్యాయామాలు ఏవీ అనుష్కకు వర్కవుట్ కాని నేపధ్యంతో పాటు జిమ్‌లో గంటల తరబడి ఇతర వ్యాయామాలుచేసినా అవేమి అనుష్క వెయిట్‌ను తగ్గించ లేకపోయాయి.
దీనితో మరో మార్గం లేక హైదరాబాద్ రోడ్ల మీద ఎవరు తనని గుర్తు పట్టకుండా ముఖానికి మాస్క్ వేసుకుని రోజుకి 20 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతోoదట ఈ అరుంధతి. ప్రస్తుతం 'భాగమతి', 'సింగం 3' 'ఓం నమో వెంకటేశాయ' సినిమాలలో నటిస్తున్నా ఆమె ప్రస్తుత ఫిజిక్ తో ఈ సినిమాలకు ఎటువంటిసమస్యలు లేకపోయినా ‘బాహుబలి 2’ మాత్రం అనుష్కకు విపరీతమైన టార్చర్ పెడుతోంది అన్నది వాస్తవం.
‘
సైజ్ జీరో’ వల్ల అవార్డులు రివార్డులు వస్తాయని ఆశపడి అనుష్క భారీ శరీరాన్ని పెంచుకుంటే ఆ సినిమాలోని ఆ పాత్ర వల్ల ఆమెకు ఎటువంటి పేరు రాకపోయినా చిట్టచివరకు ఇలా రోజుకు 20 కిలోమీటర్లు సైకిల్ తొక్కే ఆయాసం ఆమెకు మిగిలింది అనుకోవాలి..