యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫిట్నెస్ ట్రైనర్ స్టీవెన్స్ లాయిడ్ హైదరాబాద్‌కు గుడ్ బై చెప్పారు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా కోసం స్టీవెన్స్ సమక్షంలోనే ఎన్టీఆర్ ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుని దాదాపు 20కేజీల బరువును తగ్గించుకున్నాడు. ప్రతి సినిమాలోనూ సరికొత్తగా కనిపించాలని తాపత్రయపడుతుంటాడు జూనియర్ ఎన్టీఆర్.. లవకుశ మూవీ తర్వాత ఈ యంగ్ టైగర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నాడు.
ఇప్పటికే ఈ మూవీ తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.. ఈ మూవీలో సరికొత్త లుక్ లో కనిపించేందుకు హాలీవుడ్ లో పలువురు అగ్రహీరోలకు ఫిజికల్ ట్రైనర్ గా ఉన్న లాయిడ్ స్టీవెన్స్ ను హైదరాబాద్ కు పిలిపించాడు. అతడ పర్యవేక్షణలో గత రెండు నెలలుగా జిమ్ చెమటలు చిందించాడు తారక్. ఇక ట్రైనింగ్ ముగియడంతో స్టీవెన్స్ తన స్వస్థలానికి బయలుదేరి వెళ్లాడు.
ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, తారక్ తో పని చేయడం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని చెప్పాడు. ట్రైనింగ్ పిరియడ్ ముగియడంతో స్టీవెన్స్ హైదరాబాద్‌కు గుడ్‌బై చెప్పారు. ఈ సందర్భంగా స్టీవెన్స్ ఓ ట్వీట్ చేశారు. ‘ తారక్ కొత్త లుక్ ను ఎప్పుడు రివీల్ చేస్తారా? అని తాను కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని చెప్పాడు. స్టీవెన్ ట్వీట్ పట్ల త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పందించాడు. ఎన్టీఆర్ ను కొత్తగా మేకోవర్ చేసినందుకు ‘థాంక్యూ సార్’ అంటూ రీట్వీట్ చేశాడు.