ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరమీదకు రానున్న ‘అరవింద సమేత’ చిత్రంలో నందమూరి మనవడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రముఖ మెడల్, స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే జంటగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా టీజర్, పోస్టర్లు సోషల్ మీడియాలో దుమ్మురేపాయి.  అయితే రీసెంట్ గా జూ.ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ స్వర్గస్తులైనారు.  అయితే షూటింగ్ మాత్రం ఎక్కడా ఇబ్బంది రాకుండా ఎన్టీఆర్ మనోధైర్యాన్ని తెచ్చుకొని షూటింగ్ లో పాల్గొంటున్నారు. 
Related image
అయితే ఈ సినిమా ద్వారా ప్రముఖ హాస్య నటుడు సునీల్ మరోసారి కమెడియన్ గా అవతారమెత్తుతున్నారు. అయితే మొన్నటి వరకు కామెడీ హీరోగా ఉన్న సునీల్ ఒక్కసారే యూటర్న్ తీసుకొని కమెడియన్ గా మారడానికి కారణం త్రివిక్రమ్ అని చెబుతారు.  గత కొంత కాలంగా సునీల్ కెరీర్ సాఫీగా సాగడం లేదు..దాంతో కమెడియన్ గా నటిస్తే కెరీర్ గాడిన పడుతుందని సలహా ఇచ్చారట.  ప్రస్తుతం సునీల్, నరేష్ కాంబినేష్ లో భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో ‘సిల్లీఫెలోస్’ సినిమా రాబోతుంది.

ఈ నెల 7వ తారీఖున విజయవంతంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేసిన తాజా ఇంటర్వూలో అరవింద సమెత సినిమా గురుంచి సునీల్ మాట్లాడుతూ అతడు సినిమాలోని పాత్రను పోలి ఈ సినిమాలో నా పాత్ర ఉంటుందని కీలక విషయాన్నీ బయట పెట్టాడు. ప్రస్తుతం సునీల్, మాస్ మహరాజ  రవితేజ కథానాయకుడిగా వస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలో నటిస్తున్నాడు.  



మరింత సమాచారం తెలుసుకోండి: