సంచలన దర్శకుడు వర్మ కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్నా మళ్లీ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాతో హంగామా మొదలు పెట్టాడు. ఎన్.టి.ఆర్ బయోపిక్ కు పోటీగా అప్పట్లో ఏదో సరదాకి లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ పోస్టర్ పెట్టాడని అనుకోగా దసరా రోజున తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి మరి సినిమా మొదలు పెట్టాడు ఆర్జివి.


ఇక సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుందట. సినిమాలో చంద్రబాబు పాత్రకు అవే పోలికలు ఉన్న ఓ మనిషిని సెలెక్ట్ చేశాడు వర్మ. ఇక సినిమా షూటింగ్ కూడా సీక్రెట్ గా కానిస్తున్నాడట. ఇప్పటికే ఆర్జివి తీస్తున్న లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ పై విమర్శలు చేస్తున్న టిడిపి కార్యకర్తలు సినిమా షూటింగ్ కు ఎక్కడ భంగం కలిగిస్తారో అని ఎవరికి తెలియకుండా షూటింగ్ జరుపుతున్నాడట.


అంతేకాదు ఇదవరకు వర్మ తన సినిమాలో కొంత భాగం అసిస్టెంట్ లతో చేయించాడని టాక్ ఉంది. సినిమాలో ప్రాముఖ్యత లేని కొన్ని సీన్స్ వారితో తీయిస్తాడని అంటుంటారు. అయితే లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా విషయంలో అలాంటిది జరగకుండా తానే సినిమా మొత్తం దగ్గర ఉండి తీస్తున్నాడట ఆర్జివి.


షూటింగ్ టైంలో ఎలాంటి గొడవలు జరుగకుండా అసలు సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందో అనే విధంగా సైలెంట్ గా కానిచ్చేస్తున్నారట. ఇక సినిమా రిలీజ్ కూడా 2019 జనవరి 24న ఫిక్స్ చేశారట. బాలకృష్ణ చేస్తున్న ఎన్.టి.ఆర్ కథానాయకుడు జనవరి 9న వస్తుండగా.. మహానాయకుడు మాత్రం జనవరి 24న రిలీజ్ అనుకున్నారు. వర్మ కూడా అదే డేట్ కు వస్తుండటంతో రెండు సినిమాలకు పెద్ద క్లాష్ కానుంది. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: