టాలీవుడ్ లోకి హీరో రామ్ నటించిన ‘దేవదాసు’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది గోవా బ్యూటీ ఇలియానా. మొదటి సినిమాలోనే తన నడుం వంపులుతో అటు కుర్రకారుని..ఇటు దర్శక, నిర్మాతలను బుట్టలో వేసుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమా ఛాన్సులు దక్కించుకుంది ఇలియానా. కొద్ది కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించి నెంబర్ వన్ ప్లేస్ లోకి వెళ్లింది. తెలుగు లోనే కాదు తమిళ్ లో కూడా ఇలియానాకు మంచి చాన్సులు వచ్చాయి. తెలుగు లో హీరోయిన్ గా మంచి ఫామ్ లో కొనసాగుతున్న సమయంలో అనుకోకుండా బాలీవుడ్ లోకి వెళ్లింది ఇలియానా.
బాలీవుడ్ లోకి వెళ్లిన ఇలియానా పెద్దగా సినిమా ఛాన్స్ లు రాకపోగా నటించిన సినిమాలు కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. దాంతో తెలుగు లో రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్నా..కొత్త హీరోయిన్లతో ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది. చాలా కాలం తర్వాత ఇలియానా 'అమర్ అక్బర్ ఆంటోని' చేసింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, ఈ నెల 16వ తేదీన విడుదల కానుంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇలియానా మాట్లాడుతూ..తాను బాలీవుడ్ లోకి వెళ్లిన తర్వాత తెలుగు లో కొన్ని చాన్సులు వచ్చాయి...కానీ డేట్స్ కుదరకపోవడం వలన .. కథలు నచ్చకపోవడం వలన గ్యాప్ వచ్చింది.
ఆ మద్య ఐటమ్ సాంగ్ లో నటిస్తున్నానని పుకార్లు కూడా వచ్చాయి..కానీ అలాంటిది ఏదీ లేదని తాను క్లారిటీ ఇచ్చినట్లు తెలిపింది. అయితే 'అమర్ అక్బర్ ఆంటోని' కథ బాగా నచ్చడం వలన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను.నా పాత్రను శ్రీను వైట్ల చాలా అద్భుతంగా మలిచాడు. తప్పకుండా ఈ పాత్ర ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది .. నాకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఇక భవిష్యత్ లో ఎక్కువ లేడీ ఓరియెంటెడ్ కలిగిన పాత్రలను ఎక్కువగా చేయాలనుకుంటున్నాను. ఆ తరహా పాత్రల్లో నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను. అలాంటి పాత్రల కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది. గత కొంత కాలంగా ఇలియానా సమకాలీన నటీమణులు త్రిష, నయనతార ఈ తరహా పాత్రల్లో నటించి మెప్పిస్తున్నారు.