యంగ్ హీరో నితిన్ హిట్ కోసం వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా నితిన్ మంచి టేస్ట్ సినిమాలు తీసే చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ సినిమా ప్రారంభోత్సవం సాక్షిగా సినిమాలో నటిస్తోన్న రకుల్ ప్రీత్‌సింగ్ హీరో నితిన్‌ను చాలా ఘోరంగా అవమానించిందా ? అన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేస్తున్నారు.
ఇంతకు కారణం ఏంటంటే ఈ సినిమాలో నితిన్ సరసన రకుల్ హీరోయిన్గా నటిస్తోంది. సినిమా ప్రారంభోత్సవానికి టీం అంతా వచ్చినా... హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రాలేదు. మరో హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ హాజరయ్యారు. సినిమా విషయంలో రకుల్ వ్యవహరిస్తోన్న తీరు పట్ల కూడా ఆమెపై విమర్శలొస్తున్నాయి.
సినిమా ప్రారంభోత్సవానికి రకుల్ రాకపోవడంతో అందరూ బిజీగా ఉందని అనుకున్నారు. కనీసం ఆమె సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా గురించి ఏ మాత్రం ప్రస్తావించలేదు. రకుల్ చేస్తోన్న తమిళ చిత్రాన్ని, బాలీవుడ్ చిత్ర విశేషాలని ఎప్పటికప్పుడు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తోంది. ఆ సినిమాల షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి రిలీజ్ అయ్యాక కూడా బాగా ప్రమోట్ చేస్తోంది.
కానీ నితిన్ సినిమా విషయంలో ఆమె ఎందుకు పట్టించుకోవడం లేదో ? తెలియడం లేదు. బాలీవుడ్‌కు వెళ్లి పోయాను.. ఇక తెలుగు సినిమాలంటే నాకు చిన్న సినిమాలు అని ఆమె ఫీలవుతుందా ? లేదా ? నితిన్ రేంజ్ చిన్నదే అనుకుంటుందా ? అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. మరి ఈ విమర్శలపై ఆమె ఎలా స్పందిస్తుందో ? చూడాలి.