టాలీవుడ్లో ‘ఆహా కళ్యాణం’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిన
వాణి కపూర్ తన అంతరంగాలు ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. తెలుగులో నటించకముందు యశ్‌రాజ్ ఫిల్మ్ వారి ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’తో బాలీవుడ్‌కు పరిచయమైన వాణీ కపూర్ ‘ఆహా కళ్యాణం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. శ్రుతి సుబ్రమణ్యం పాత్రతో ఆకట్టుకుంది. ఆదిత్యచోప్రా భారీ చిత్రం ‘వార్’తో ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈ సినిమాలో హృతిక్‌రోషన్, టైగర్ ష్రాఫ్‌లతో కలిసి నటించిన
వాణి కపూర్ అంతరంగాలు, పలు విషయాలు తెలిపింది.
తన చిన్ననాటి విషయాలు చెబుతూ ఢిల్లీలో పుట్టి పెరిగాను. భోజనప్రియురాలిని. సినిమాలు కొత్త, పాత, హిట్టు, ఫట్టు అనే తేడా లేకుండా తెగ చూసేదాన్ని అని చెప్పుకొచ్చింది ఈ అందాల భామ. ఇంకా మా ఫామ్‌హౌస్‌లో ఎన్నో జంతువులు ఉండేవి. కుక్కలు, కోతులు, గుర్రాలు, కుందేళ్లు, పిల్లులు ఇలా ఎన్నో
మినీ జూ లా ఉంటుందని అని చెప్పుకోవచ్చు అనుంటుంది. కుక్క పిల్లలంటే ఎంత ప్రేమంటే బురదలో పొర్లాడే వాటిని కూడా ఇంటికి తీసుకువచ్చి శుభ్రపరిచేదాన్ని. ఇంట్లో చాలా క్రమశిక్షణగా పెంచారు. స్వేచ్ఛగా ఎక్కడికైనా ఎగిరిపోవాలనిపించేది అని తెలిపింది.
ఇక చదువు గురించి వస్తే టూరిజం స్టడీస్ కోసం మొదటిసారి ఢిల్లీలో హాస్టల్లో ఉన్నాను. నేను మోడలింగ్‌లోకి రావడం మా నాన్నకి ఎంతమాత్రం ఇష్టంలేదు. ఆర్మీ నేపథ్యం నుంచి వచ్చిన అమ్మ మాత్రం నన్ను ప్రోత్సహించేది. మా అక్కకు 18 సంవత్సరాలకే పెళ్లి అయిపోయింది. నాకు స్వతంత్రభావాలు ఎక్కువ.
మోడలింగ్ ఏజెన్సీలకు ఇంటర్వ్యూలకు వెళుతున్న సమయంలో లావుగా ఉండేదాన్ని. అయినప్పటికీ సెలెక్ట్ అయ్యాను.
ఆ తరువాత మాత్రం రకరకాల వ్యాయమాలు చేసి బరువు తగ్గాను అని చెపింది ఈ సొట్ట బుగ్గల సుందరి. కాస్టింగ్ కౌచ్ భయంతో మొదట్లో ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి భయపడ్డాను. కానీ గుర్తింపు ఉన్న మోడలింగ్ ఏజెన్సీ నుంచి రావడం వల్ల కావచ్చు, అదృష్టవశాత్తు నాకు అలాంటి సమస్యలు ఎదురుకాలేదు అని ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలా విషయాలు తెలిపింది వాణీ కపూర్.