సూపర్ స్టార్ రజినీకాంత్ భేషజాలకు చాల దూరంగా ఉంటాడు. అదేవిధంగా వివాదాలకు కూడా సాధ్యమైనంత దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాడు రజినీ. అటువంటి సూపర్ స్టార్ మొన్న ఆదివారం చెన్నైలో జరిగిన ‘లింగ’ తమిళ టీజర్ లాంచింగ్ సందర్భంగా తన రాజకీయ ప్రవేశం గురించి క్లారిటీ ఇస్తూ తన కుమార్తె సౌందర్య పై ఎవరూ ఊహించని సెటైర్లు వేసాడు.  తన కుమార్తె సౌందర్య డబ్బు సంపాదించావలసిన అవసరం లేదని అయితే తాను సంపాదించినది వృధా చేయవలసిన పని కూడా తన కుమార్తె సౌందర్యకు అవసరం లేదు అని ఆమెను చూస్తూ నవ్వుతూ వేసిన సెటైర్ కోలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.  సౌoదర్య దర్శకత్వం వహించిన ‘కొచ్చాడియాన్’ సినిమా ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో ఈ సినిమా వల్ల రజినీకి పేరు పోవడమే కాకుండా ఆర్ధికంగా బాగా నష్టాన్ని మిగిలిచ్చింది అనే విషయం ఓపెన్ సీక్రెట్. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రజిని తన సొంత కుమార్తె పై సెటైర్లు వేసాడు అంటూ కామెంట్లు రాస్తోంది కోలీవుడ్ మీడియా.  అయితే రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ తాను నటించిన సినిమా ఘోర పరాజయం చెందింది అన్న విషయాన్ని మీడియా ముందు అంగీకరిస్తూ మాట్లాడే దమ్ము ఒక్క రజినీకాంత్ కు తప్ప మరెవ్వరికీ లేదు అంటూ రజినీని ఆకాశానికి ఎత్తేస్తూ కామెంట్లు రాస్తోంది మీడియా..    

మరింత సమాచారం తెలుసుకోండి: