గత కొన్ని రోజులుగా ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఆసక్తికరంగా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఆదివారం హైదరాబాద్‌లో ప్రశాంతంగా ముగిశాయి అన్న విషయం తెలిసిందే. జయప్రద, రాజేంద్రప్రసాద్‌ల ప్యానల్‌ల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది.


కోర్టు తుది తీర్పును అనుసరించి ఫలితాలపై 


ఇరు వర్గాల మద్దతుదారులు, అభిమానుల తాకిడితో ఫిలింనగర్ ప్రాంతాలన్నీ కోలాహలంగా మారాయి. పలువురు నటీనటులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో గెలుపు ఎవరిని వరిస్తుందనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. మంగళవారం వెలువడనున్న కోర్టు తుది తీర్పును అనుసరించి ఫలితాలపై ఓ నిర్ణయానికి వస్తామని మా ఎన్నికల నిర్వహణ అధికారి కృష్ణమోహన్ చెప్పారు.

ఓటింగ్ కి వచ్చిన చిన్న ఆర్టిస్ట్ లు అందరూ రాజేంద్రప్రసాద్ కి 

ఇదిలా ఉంటే ఈ ఎలక్షన్స్ గెలుపు కచ్ఛితంగా రాజేంద్రప్రసాద్ అని ఇండస్ట్రీలోని పెద్దలు సైతం అనుకుంటున్నారు. ఎందుకంటే ఓటింగ్ కి వచ్చిన వారిలో ఎక్కువుగా పెద్ద హీరోలు ఎక్కువుగా లేరు. అలాగే ఓటింగ్ కి వచ్చిన చిన్న ఆర్టిస్ట్ లు అందరూ రాజేంద్రప్రసాద్ కి ఓట్లు వేసినట్టుగా టాక్స్ వినిపిస్తున్నాయి.


అల్లరి నరేష్, తన వర్గం కి సంబంధించిన చాలా మంది


ఇదిలా ఉంటే హీరో అల్లరి నరేష్, తన వర్గం కి సంబంధించిన చాలా మంది ఆర్టిస్ట్ లను రాజేంద్రప్రసాద్ కి అనుకూలంగా ఓట్లు వేయించినట్టుగా ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. దీంతో అందరూ ఊహించినట్టుగా జయసుధ వైపు వన్ సైడ్ విక్టరి ఉంటుంది అనుకున్న వాళ్ళు, ఇప్పుడు గెలుపు అభ్యర్ధి ఎవరై ఉంటారు అంటూ ఆసక్తి కనపబరుస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: