రాజకీయంగా ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో భారత్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉండవచ్చు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు తో సన్నిహితంగా ఉండే ప్రయత్నం చేస్తుందనే భావనను కూడా కొంతమందిలో ఉంది. గతంలో బారక్ ఒబామాతో కాంగ్రెస్ పార్టీ నేతలు సన్నిహితంగా మెలిగారు. అందుకే ఇప్పుడు ఆ సన్నిహిత సంబంధాల కోసం మళ్లీ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. ఇక చైనా తో కూడా ఇప్పుడు మంచి సంబంధాలు అమెరికాకు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక బ్రిటన్ సహా కొన్ని దేశాలు అమెరికాతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ ఉన్న సమయంలో అనుకున్న విధంగా ఫలితాలు కనపడలేదు అందుకే ఇప్పుడు చాలావరకు జాగ్రత్తలు పడుతున్నాయి. అయితే ఇప్పుడు అమెరికా కూడా భారత్ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకునే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇప్పటికే తన టీంలో భారతీయులకు ఎక్కువగా ప్రాధాన్యత కల్పించిన ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు భారతీయ విద్యార్థుల కోసం కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా భారతీయ ఐటి ఉద్యోగుల కోసం ఆయన ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి