భారతదేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం వ్యాక్సినేషన్ డ్రైవ్ త్వరితగతిన ప్రారంభించింది. అయితే భారత జనాభా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి కోట్లల్లో వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేయాల్సి వస్తోంది. ఇప్పటికిప్పుడు వందల కోట్ల సంఖ్యలో డోసులు ఉత్పత్తి చేయడం అసాధ్యమని వ్యాక్సిన్ తయారీదారులు కూడా చెబుతున్నారు.


దీంతో కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాలనుంచి కరోనా టీకాలను దిగుమతి చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా సర్కార్ కి ఇండియన్-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి భారతదేశానికి 60 మిలియన్ల టీకా డోసులు సరఫరా చేయమని విజ్ఞప్తి చేశారు. భారత దేశంలో ఇప్పటివరకు కరోనాతో 2 లక్షలకు పైగా మరణాలు సంభవించాయని.. కరోనా రెండవ దశలో గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా చనిపోతున్నారని.. అత్యవసరంగా టీకాలు సరఫరా చేయాలని అమెరికన్ సివిల్ రైట్స్ కార్యకర్త జాక్సన్ అధ్యక్షుడు జో బైడెన్ కి విజ్ఞప్తి చేశారు.



టీకాలను త్వరగా ఇండియాకి పంపించాలని కృష్ణ మూర్తి శ్వేతసౌధానికి మరొకసారి విజ్ఞప్తి చేశారు. అమెరికా 60 మిలియన్ల టీకాలను ఇండియాకి సరఫరా చేయాలని ఆయన బైడెన్ సర్కార్ ని కోరారు. ఇండియా తో పాటు కరోనా తో పోరాడుతున్న మిగతా దేశాలకు కూడా టీకాలు పంపించాలని ఆయన అన్నారు. కరోనా సంక్షోభంలో భారత్ కి కచ్చితంగా సాయం చేస్తామని ఆయన గతంలో హామీ ఇచ్చారు.



"త్వరలోనే సహాయం అందుతుంది. మేము చేయాల్సిందల్లా చేస్తున్నాము. కోవిడ్ స్పెషల్ కమిటీలో నేను ఒక సభ్యుడిని. నా బాధ్యత నెరవేర్చడానికి కృషి చేస్తాను. కరోనా తో బాధపడుతున్న వారు అందరి గురించి నేను ఆలోచిస్తున్నాను. మేము అందరం కూడా దేవుడిని ప్రార్థిస్తున్నాము. మేము ఖచ్చితంగా సహాయం చేస్తాము" అని ఒక వార్తా సంస్థకు కృష్ణమూర్తి తెలిపారు. ఇదిలా ఉండగా జులై నెల లోపు సెకండ్ వేవ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: