ప్రస్తుతం చిన్న దేశమైన ఉక్రెయిన్లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. కేవలం మిలటరీ యాక్షన్ మాత్రమే అంటూ చెప్పిన రష్యా ఏకంగా ఉక్రెయిన్ పై యుద్ధానికి సిద్ధమైంది. నిన్నటి వరకు తమకు ఉక్రెయిన్ పై యుద్ధం చేసే ఉద్దేశం లేదు అంటూ చెప్పిన రష్యా... ఇప్పుడు మాత్రం యుద్ధానికి తెగించింది. దీంతో ఉక్రెయిన్లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధ విమానాలతో ఉక్రెయిన్ రష్యా విజృంభిస్తుండడంతో రష్యా మొత్తం ఉక్కిరిబిక్కిరి అవుతుంది అని చెప్పాలి.



 రష్యా సైన్యం తో పోల్చి చూసుకుంటే ఏమాత్రం సరి తూగని ఉక్రెయిన్ అగ్ర దేశమైన రష్యాను ఎలా ఎదుర్కోవాలనే తేలిక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ప్రపంచదేశాలు సహాయం చేయాలి అంటూ దీనంగా విజ్ఞప్తి చేస్తుంది ఉక్రెయిన్ . అయితే మొన్నటి ఉక్రెయిన్ కు మద్దతుగా ఉంటామని రష్యా యుద్ధం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించిన నాటో యూరోపియన్ యూనియన్ అమెరికా లాంటి దేశాలు ప్రస్తుతం ఉక్రెయిన్ ను నట్టేట ముంచాయి అని చెప్పాలి. రష్యా యుద్ధం చేస్తున్న సమయం  లో కనీస మద్దతు ఇవ్వకుండా ఉక్రెయిన్ ను ఒంటరిగా వదిలేసాయి.  ఎలాంటి ఆయుధ ఆర్థిక సహాయం చేయకుండా కేవలం రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించడం తోనే సరిపెట్టు కుంటూన్నాయ్ అటు యూరోపియన్ యూనియన్ దేశాలు.



 ఇక ఇటీవల ఇదే విషయం పై ఉక్రెయిన్ అధ్యక్షుడు  స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ దేశం పై జరుగుతున్న దాడిని అత్యంత శక్తి వంతమైన దేశం గా ఉన్న అమెరికా మాత్రం దూరం నుండి చూస్తూ ఉండి పోయింది అంటూ అమెరికాను ఉద్దేశిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు.. ఉక్రెయిన్ రాజధాని నగరమైన కీవ్ నగరంలో ప్రవేశించిన రష్యన్ ఆర్మీ ని తరిమి కొట్టేందుకు కేవలం ఆంక్షలు మాత్రమే సరిపోవు అని.. దీనినీ పట్టుదల సంఘీభావం తోనే సాధించగలం అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు చెప్పుకొచ్చారు..

మరింత సమాచారం తెలుసుకోండి: