ఒక ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలు పెట్టి 10 రోజులు గడిచి పోతున్నాయి. కానీ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మాత్రం ఎక్కడా తగ్గుముఖం పట్టలేదు. రోజు రోజుకు యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. రష్యా ఉక్రెయిన్ పై తమ పూర్తి బలంతో దాడికి పాల్పడడంతో  ఉక్రెయిన్ లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. ఇప్పటికే ఒక ఉక్రెయిన్ లో ఉన్న ప్రధాన నగరాలు అన్నింటినీ కూడా రష్యా క్రమంగా తమ ఆధీనం లోకి తెచ్చుకున్నారు.


 ఈ క్రమం లోనే అటు కీవ్ నగరాన్ని కూడా ఆధీనం లోకి తెచ్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి.  అదే సమయం లో అటు అధ్యక్షుడు జెలెన్ స్కీ నీ హతమార్చేందుకు రష్యాకు చెందిన ప్రైవేటు సైనికులు కూడా రంగం లోకి దిగారు అంటూ టాక్ వినిపిస్తోంది. ఇలాంటి సమయం  లో అండగా ఉంటామని హామీ ఇచ్చిన అమెరికా  యూరోపియన్ యూనియన్ దేశాలు కేవలం రష్యా పై ఆంక్షలు విధించడం తో సరిపెట్టుకుంటున్నాయ్.


 ఎక్కడ ఉక్రెయిన్ కు ఆయుధ సహకారం మాత్రం చేయడం లేదు.. ఉక్రెయిన్ ఇప్పుడు అగ్ర దేశమైన రష్యా తో ఒంటరిగా పోరాటం చేస్తోంది. కాగా  ఇటీవల అమెరికా చట్ట సభ సభ్యుల తో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు యుద్ధ విమానాలు అందించాలని కోరారు.  తనను సజీవంగా చూడటం ఇదే చివరిసారి కావచ్చు అంటూ భావోద్వేగ పూరిత వ్యాఖ్యలు చేసారూ. తాను ఎక్కడికి పారిపోలేదు.. రాజధాని నగరంలోనే ఉన్న.. తమ ఘటనా స్థలాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించాలంటూ నాటో కు మరోసారి విజ్ఞప్తి చేశారు. స్వాతంత్రాన్ని వదులుకునేందుకు ప్రజలు సిద్ధంగా లేరని ఆక్రమణదారుల నుంచి మాతృభూమినీ కాపాడుకుంటామ్ అంటూ చెప్పుకొచ్చారు. ఒక్క అంగుళం భూభాగం కూడా వదులుకోబోమని స్పష్టం చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: