సాధారణంగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కాలని ఎంతోమంది ఆశ పడుతూ ఉంటారు. ఇక గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించడం ద్వారా తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని భావిస్తూ ఉంటారు. అయితే మాట్లాడుకున్నంత సులభంగా గిన్నిస్ బుక్ లో రికార్డు సాధించలేం అన్నది చాలామందికి తెలుసు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అందరికంటే ప్రత్యేకమైన టాలెంట్ ఉన్నప్పుడు మాత్రమే గిన్నిస్ బుక్ లో రికార్డు సాధించడానికి అవకాశం ఉంటుంది   ఈ క్రమంలోనే కొంతమంది గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకోవడం కోసం కొన్ని ఏళ్లపాటు కష్టపడుతూ ఉంటారు.


 కానీ చాలామందికి నిరాశ ఎదురవుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే మనుషులకే అసాధ్యమైన గిన్నిస్ బుక్ రికార్డును ఇటీవల ఒక పిల్లి సాధించింది. పిల్లి గిన్నిస్ బుక్ రికార్డు సాధించడం ఏంటి.. ఇంతకీ గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకోవడానికి అసలు ఆ పిల్లి ఏం చేసింది అని అనుకుంటున్నారు కదా.  సాధారణంగా పిల్లి ఒకటి లేదా రెండు అడుగుల పొడవు ఉంటుంది. కానీ మనందరికీ తెలిసిన పిల్లి ఒకవేళ పది అడుగులకు పైగానే పెరిగితే ఎలా ఉంటుందో ఊహించారా.. పిల్లి పది అడుగులు పెరగడం ఏంటి.. పది అడుగులు ఉంది అంటే దాన్ని చిరుతప్పులు అంటారు ఎవరైనా అని సమాధానం చెబుతారు.


 ఇక్కడ ఒక పిల్లి మాత్రం పది అడుగుల వరకు పెరిగి ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి వచ్చింది. డాక్టర్ విలియం జాన్ పవర్స్ అనే వ్యక్తి సవన్న జాతికి చెందిన పిల్లల్ని పెంచుతూ ఉంటారు  కాగా ఈయన పెంచిన పిల్లి ఇటీవలే 18.83 అంగుళాల పొడవుతో గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించింది   ఇటీవల ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ నేను పెంచిన పిల్లి గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించడం ఎంతో సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు మాత్రమే కాదు గతంలో కూడా నాలుగు సార్లు నేను పెంచిన పిల్లులు  గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్నాయి. మరోసారి వరల్డ్ రికార్డు సృష్టించిన పిల్లి పెన్నీర్ అంటారేస్ పవర్ జాతికి చెందినది అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Cat