
అయితే ఇటీవలే కాలంలో అటు ప్రపంచ దేశాలలో కరోనా వైరస్ ప్రభావం తగ్గిపోయిన నేపథ్యంలో ఇక మాస్క్ వాడకం తప్పనిసరి కాదు అంటూ అటు ప్రభుత్వాలు నిబంధనను ఎత్తివేసాయి. కానీ మళ్ళీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ ఇక కేసులు సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక ఎన్నో నగరాల్లో మాస్క్ తప్పనిసరి చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు అని చెప్పాలి. ఇక ఇటీవల ఒక మహిళా డాక్టర్ ఏకంగా మాస్క్ కారణంగా జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జర్మనీ లోని వెన్ హిన్ నగరంలో మాస్క్ అవసరం లేదని ఒక మహిళ డాక్టర్ చెప్పింది. ఏకంగా ఆమెకు 4000 మందికి మాస్కులు ధరించవద్దని ఆ డాక్టర్ సర్క్యులర్ జారీ చేసింది. దీనిపై కోర్టు విచారణ చేపట్టగా మాస్కులు ధరించడం ఆరోగ్యానికి హానికరం అని వాదించారు ఆ మహిళ డాక్టర్. ఆమె వాదనను కోర్టు వ్యతిరేకించింది. డాక్టర్‌కు రెండు సంవత్సరాల తొమ్మిది నెలల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు మూడేళ్ల పాటు ప్రాక్టీస్ చేపట్టకుండా నిషేధం తెలుస్తుంది అని చెప్పాలి. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.