ప్రతి మనిషి జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నప్పటికీ అటు తండ్రీ కూతుర్ల బంధం మాత్రం ఎంతో ప్రత్యేకమైనది అని అందరూ చెబుతూ ఉంటారు. ఎందుకంటే తండ్రి తన కూతురిలో తన తల్లిని చూసుకుంటాడు.. అదే సమయంలో కూతురు ఏకంగా తన తండ్రి ఒక సూపర్ హీరో అని భావిస్తూ ఉంటుంది. ఇక ఇద్దరు ఒకరిపై ఒకరు అమితమైన ప్రేమాభిమానాలను చూపించుకుంటూ ఉంటారు. అయితే కడుపున పుట్టిన కొడుకు పై కూడా ప్రేమ చూపిస్తాడు తండ్రి. కానీ కూతురు అంటే ఎందుకో కొడుకు కంటే కాస్త ఎక్కువ ఇష్టమే ఉంటుంది.


 ఇలా అల్లారు ముద్దుగా చూసుకున్న తండ్రి ఇక లేడు అన్న విషయం తెలిస్తే ఆ కూతురు గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఇక్కడ ఏడేళ్ల వయసులోనే ఆ బాలికకు ఇంతటి కొండంత బాధను భరించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇక తండ్రి మరణాన్ని తట్టుకోలేకపోయిన కూతురు  తండ్రి సమాధి దగ్గరికి వెళ్లి కథలు వినిపించడం చేస్తూ ఉంది. ఈ ఘటన చైనాలోనే కెనాన్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. ఆ బాలిక పేరు లీన్ లి. బాలిక తండ్రి గత ఏడాది చేపలు పడుతూ నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. అయితే తండ్రి మరణాన్ని చిన్నారి హృదయం తట్టుకోలేకపోయింది.


 ఈ క్రమంలోనే ఆ బాలిక తన అత్తతో గత రాత్రి తనకు తండ్రి కనిపించాడు అని తెలిపింది. తర్వాత రోజు తనను తండ్రి సమాధి దగ్గరకు తీసుకువెళ్లాలి అంటూ మొండి పట్టు పట్టింది. ఇలా తండ్రి సమాధి దగ్గరికి తీసుకువెళ్లిన తర్వాత ఏకంగా తండ్రి సమాధి వద్ద కూర్చొని హాయిగా తండ్రితో కథలు చెబుతూ గడిపింది ఆ చిన్నారి.  అయితే ఆ చిన్నారి తల్లి కూడా ఆమెను వదిలేసి ఎప్పుడో వెళ్లిపోయింది. ఇక ఇప్పుడూ తండ్రి చనిపోవడం తల్లి వదిలేయడంతో చిన్నారి అనాధగా మారింది. దీంతో ఇక ఆమె అత్త ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆమె ఎవరైనా సహాయం చేస్తారేమో అని భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: