అయితే, బుమ్రా బౌలింగ్ చేసేటప్పుడు ల్యాండ్ అవుతున్న సమయంలో అతని మడమ చాలా వికృతంగా ట్విస్ట్ అయ్యింది. దాంతో అతడికి నొప్పి కలిగింది. ఆ నొప్పి వల్ల అతని బౌలింగ్‌కు అంతరాయం కలిగింది. అతను డెలివరీ తర్వాత కుంటుతూ కనిపించాడు, కానీ బుమ్రా బౌలింగ్ చేస్తూనే ఉన్నాడు. అతని తర్వాతి ఓవర్‌లో పాతుమ్ నిస్సాంకను ఔట్ చేశాడు. దాంతో అతని డెడికేషన్ కి ఇండియన్ ఫ్యాన్స్ అందరూ ఫిదా అయ్యారు. చిన్న గాయమైతే చాలు కీలక సమయంలో కూడా చాలామంది పెవిలియన్ బాట పడతారు కానీ బుమ్రా టీమిండియా గెలుపు కోసం నొప్పిని కూడా భరించుకుంటూ బౌలింగ్ చేశాడు అలాంటి గొప్ప క్రికెటర్లు మన ఇండియా కి చాలా అవసరమని కామెంట్లు చేశారు.
సెప్టెంబర్ 2022లో వెన్ను గాయం కారణంగా బుమ్రా చాలా క్రికెట్ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతను గత సంవత్సరం t20 ప్రపంచ కప్ లేదా 2023 IPL సీజన్‌లో భారత జట్టులో భాగం కాలేదు. అయితే, అతను ఐర్లాండ్‌తో జరిగిన T20I సిరీస్‌తో తన కంబ్యాక్ చేసాడు. రాబోయే ODI ప్రపంచ కప్‌లో భారతదేశానికి ప్రధాన పాత్ర పోషిస్తాడని భావిస్తున్నారు. టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బౌలర్లలో ఎడమచేతి వాటం స్పిన్నర్ వెల్లలాగే, ఆఫ్ స్పిన్నర్ అసలంక వరుసగా ఐదు, నాలుగు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది. 41 ఓవర్లలో 172 పరుగులకే అందర్నీ ఆలౌట్ చేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి