Image result for america and china

కాశ్మీర్ ఇష్యూను సెటిల్ చేయడానికి అమెరికా, చైనాల సహకారం తీసుకోవాలంటూ ఫరూక్ అబ్దుల్లా సూచించారు. “ఈ సమస్యపై ఇంకెంతకాలం వెయిట్ చేయాలి? కొన్నిసార్లు ఎద్దులను కొమ్ములతోనే వంగదీయాలి. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు భాగస్వామ్య దేశాలను వాడుకోవాలి. మనం అడక్కపోయినా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు కాశ్మీర్ సమస్యను తాను సెటిల్ చేస్తానని.! కాశ్మీర్ వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించేందుకు తాను కూడా సిద్ధంగా ఉన్నట్టు చైనా చెప్పింది. ఎవరో ఒకరిని సంప్రదించాలి” అన్నారు ఫరూక్ అబ్దుల్లా.

 Image result for farooq abdullah

ఫరూక్ అబ్దుల్లా కామెంట్స్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సీరయస్ గా తీసుకున్నారు. అమెరికా, చైనాలు జోక్యం చేసుకున్న సిరియా, ఆఫ్గనిస్తాన్, ఇరాక్.. లాంటి దేశాల పరిస్థితి ఎలా ఉందో చూడాలని హితవు పలికారు. మీ పెద్దరికం మాకు అక్కర్లేదు. మీ పని మీరు చూసుకుంటే బాగుంటుందని ఆమె అమెరికా, చైనాలకు సూచించారు.


కాశ్మీర్ వివాదాన్ని మేం అంతర్గతంగా పరిష్కరించుకోగలమని ముఫ్తీ చెప్పారు. అమెరికా, చైనా.. లాంటి దేశాల మధ్యవర్తిత్వం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఫరూక్ అబ్దుల్లా లాంటి నేతలు గ్రహించాలని హితవు పలికారు. సిరియా, ఆఫ్గనిస్తాన్.. లాంటి దేశాలకు పట్టిన గతే మనకూ పట్టాలని మీరు కోరుకుంటున్నారా.. అని ఫరూక్ అబ్దుల్లాను ముఫ్తీ ప్రశ్నించారు. భారత్, పాకిస్తాన్ లు ఉమ్మడిగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలంటూ వాజ్ పేయి హయాంలో చేసిన లాహోర్ డిక్లరేషన్ ను మర్చిపోయారా.. అని నిలదీసింది. మన అంతర్గత సమస్యను పరిష్కరించేందుకు మూడో దేశం జోక్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: