ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 150 రోజులే అయినా లెక్కపెట్టలేనన్ని సంచలన నిర్ణయాలు తీసుకొని ప్రజల ముఖాల్లో చిరునవ్వులు పూయించాడు. అధికారంలో చేతిలోకి రాగానే అచ్చం తండ్రిలా తాను ప్రజలకు వరలు కురిపిస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు. 

                                 

అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించి సంచలనం సృష్టించాడు. యువ ముఖ్యమంత్రి అయినా ప్రజల కష్టాలు తెలుసుకొని ఎక్కడ ఎవరికి ఏ బాధ వచ్చిన సరే ఆ భాద మరిచేలా వారికీ వరాలు కురిపిస్తున్నాడు. ఇంకా ఈ జగన్ అన్న హయాంలో నిరుద్యోగులకు పండుగా అనే చెప్పాలి. 

                              

కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ వారిని రెగ్యులర్ ఉద్యోగులుగా చేశాడు. ఇలా ఎన్నో వరాలు ఇచ్చిన జగన్ అన్న.. జనవరిలోను మరి ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నాడు. ఈ నేపథ్యంలోనే జనవరిలో ఉద్యోగాల జాతర ప్రారంభం కానుంది. 44,941 పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. 

 

ఏపీలోని నిరుద్యోగుల కోసం ప్రభుత్వం మరో నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. పోలీసు శాఖలో 13,591 పోస్టులు, డి.స్.సిలో 20,000 పోస్టులు, గ్రూప్ -2 లో 1,000 పోస్టులు, గ్రూప్ IVలో   2,600 పోస్టులు, అటవీ శాఖలో 2,750 పోస్టులు, ఇతరులు 5,000 పోస్టుల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏది ఏమైనా ఏపీ నిరుద్యోగులు అదృష్టవంతులు. ఒకసారి మిస్ అయితే మరోసారి అన్నట్టు ప్రభుత్వ ఉద్యోగాల నియామకం జరుగుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: