ఆమ్ ఆద్మీ పార్టీని చూసి బీజేపీ బిత్తరపోతోందా...? ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీయే ప్రధాన అడ్డంకి అని భావించిన కమలానికి ఆప్ కొత్త టెన్షన్ గా మారిందా..? అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు...ఆప్ ఫీవర్ ను అధిగమించేందుకు బీజేపీ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఆప్ లో కచ్చితంగా చీలిక వస్తుందంటూ ప్రచారం మొదలెట్టింది.  వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఢిల్లీ పీఠంపై పాగా వేయాలని తహతహలాడుతున్న బీజేపీకి ఇప్పుడు ఆమ్ ఆద్మీ రూపంలో కొత్త చిక్కు వచ్చి పడింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం పక్కా ప్రణాళికతో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడిని ప్రధాని అభ్యర్ధిగా ముందుకు తీసుకొచ్చింది..నరేంద్రమోడి మేనియాతో పట్టణ ప్రాంతాల ఓటర్లను, యువతును ఆకర్షించవచ్చనే ఆశతో ఉంది..అయితే అనుహ్యంగా కేజ్రీవాల్ సారధ్యంలో ఏర్పడిన ఆమ్ ఆద్మీపార్టీతో గట్టి పోటీ ఎదురుకావడంతో కొత్త వ్యూహాలకు పదును పెట్టే పని లో పడింది. ఆప్ లో కీలక నేతల మధ్య కొంత చీలిక వచ్చిన నేపధ్యంలో..దానిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు కమలనాధులు. .ఐతే ఆమ్ ఆద్మీకి పట్టణప్రాంతాల్లో భారీగా సభ్యత్వం నమోదు కావడం ఆ పార్టీని కలవరపరుస్తోంది..ముఖ్యంగా నరేంద్ర మోడీ తన చరిష్మా , ఇమేజ్ ను కాపాడుకునే పనిలో పడ్డాడు. దీంతో ఆప్ ను టార్గెట్ చేశాడు. ఇప్పటికే కొంతమంది ఆప్ ఎమ్మెల్యేలు తమ పార్టీ వైపు చూస్తున్నారని బీజేపీ ప్రచారం చేస్తోంది.అందుకే ఆప్ కి చెక్ పెట్టే దిశగా.. నరేంద్రమోడి గోవా సభలో తనదైన స్టైల్లో విమర్శలు గుప్పించాడు. ఆప్ ప్రభావంతో కాంగ్రెస్ కే ప్రయోజనం కలుగుతుందంటూ ఆమ్ ఆద్మీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఐతే బీజేపీ తీసుకుంటున్న చర్యలు..ఆమ్ ఆద్మీ జోరుకు బ్రేక్స్ వేస్తాయో లేదో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: