ప‌సిఫిక్ మ‌హాస‌ముద్రంలోని కురిళ్ ద్వీపాల స‌మీపంలో బుధ‌వారం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8 నమోదు అయిందని.. అమెరికా నేషనల్ ఓషియానిక్, అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. భూకంప కేంద్రం కురిళ్‌లోని సెవెరో ప‌ట్ట‌ణానికి ఆగ్నేయ దిశ‌లో 218 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. దీని కార‌ణంగా విధ్వంస‌క‌ర‌మైన సునామీ ఏర్ప‌డ‌వ‌చ్చ‌ని, అది హ‌వాయ్, మిడ్‌వే, ఉత్త‌ర మెరియ‌నాస్‌, వేక్ దీవుల‌కు తీవ్ర న‌ష్టం క‌లిగించ‌వ‌చ్చ‌ని హెచ్చ‌రించింది. అలాగే జ‌పాన్‌, రష్యా దేశంలో ఉన్న తీర ప‌ట్ట‌ణాల‌కు తీర‌ని న‌ష్టం క‌ల‌గ‌వ‌చ్చ‌ని తెలిపింది.  

 

అయితే, జ‌పాన్ సునామీ హెచ్చ‌రిక‌ల కేంద్రం మాత్రం పెద్ద ప్ర‌మాద‌ము జరగదని తెలిపింది. జపాన్‌కు ఉత్తరాన కురిల్ గొలుసుపై సెవెరోకు ఆగ్నేయంగా 136 మైళ్ల దూరంలో భూకంపం సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఇది 37 మైళ్ల లోతులో ఉంద‌ని నివేదిక‌ల్లో స్ప‌ష్టం చేసింది.. ఉత్తర పసిఫిక్‌లో బుధవారం A7.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని, సమీప తీరాలకు సునామీ తరంగాలు సాధ్యమని అధికారులు తెలిపారు. హవాయి కోసం సంక్షిప్త సునామీ వాచ్ రద్దు చేయబడింది. పసిఫిక్ సునామి హెచ్చరిక కేంద్రం మొదట్లో కురిల్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రమాదకర తరంగాలు సాధ్యమని హెచ్చరించాయి. 

 

అల‌ల ఎత్తు  ఎక్కువ త‌క్కువ‌గాలు ఉండ‌వ‌చ్చ‌ని జియోలాజిక‌ల్ అధికారులు తెలిపారు. సునామీ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ముంద‌స్తుగా హవాయి కోసం జారీ చేసిన సునామీ సంకేతాన్ని కొద్దిసేప‌టికే ర‌ద్దు చేశారు. అస‌లే క‌రోనా వైర‌స్ వ్యాప్తితో ప్ర‌పంచ దేశాలు అత‌లాకుత‌లం అవుతున్న నేప‌థ్యంలో భూకంపం సంభ‌వించింద‌న్న వార్త‌తో ఫ‌సిఫిక్ తీర దేశాల‌ను తీవ్ర క‌ల‌వర‌పాటుకు గురి చేశాయి. ఇప్ప‌డున్న ప‌రిస్థితుల్లో మ‌రో ఉప‌ద్ర‌వాన్ని త‌ట్టుకునే శ‌క్తి ఈ ప్రంప‌చానికి లేదు అంటూ వేలాదిమంది నెటిజ‌న్లు  ప్ర‌కృతిని ఉద్దేశించి స్పందించారు. ఇక చాలు ఘోరాలు..శాంతించు..అంటూ ప్ర‌కృతిని వేడుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: