ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ భారీ స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా వరకు ప్రజలకు దూరంగా ఉంటూ ఫాంహౌస్ లోనే సేదతీరుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇంటికే పరిమితమైన పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియాలో ఎత్తిచూపుతూ స్పందిస్తున్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ చతురస్మ దీక్ష చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 2003వ సంవత్సరం నుండి మనశ్శాంతి కోసం ఈ దీక్ష చేస్తున్నట్లు చెప్పిన పవన్ కళ్యాణ్…. ఈ సారి మాత్రం ప్రజల సంక్షేమం కోసం దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. 

 

ఇదిలా ఉండగా దేశంలో మరియు ప్రపంచంలో విస్తరిస్తున్న కరోనా వైరస్ గురించి స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్యను ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్నారు కాబట్టి ప్రభుత్వాలపై విమర్శలు చేయటం కంటే సూచనలు ఇవ్వడం బెటర్ అని పవన్ మాట్లాడుతూ రెండు నెలల లాక్ డౌన్ టైంలో… ఈ మహమ్మారిని ఎదుర్కోవటానికి ప్రభుత్వాలు అన్ని రకాలుగా రెడీ అయి ఉంటే బాగుండేది అని పవన్ తెలిపారు. చాలావరకు కరోనా బారిన పడిన వాళ్ళు వైద్యం అందక చనిపోతున్నారని, అదే రెండు నెలల సమయంలో ప్రభుత్వాలు.. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి వైద్య రంగాన్ని రెడీ చేసి ఉంటే ఇన్ని మరణాలు సంభవించేవి కాదని చెప్పుకొచ్చారు. 

 

జగన్ ప్రభుత్వం కరోనా వైరస్ ని ఎదుర్కొనే విషయంలో ఫ్లూ వంటిదని భావించారని వ్యాఖ్యానించారు. ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ రెండు నెలల లాక్ డౌన్ కాలాన్ని సరైన రీతిలో సద్వినియోగం చేసుకోలేక పోవడం తోనే ఏపీలో లాక్ డౌన్ తర్వాత పాజిటివ్ కేసులు భారీ స్థాయిలో బయట పడుతున్నాయి అని తెలిపారు. కరోనా టెస్ట్ చేస్తే సరిపోదు, రోగికి సరైన ఆహారంతో పాటు చికిత్సను ఏపీ ప్రభుత్వం అందించడం లేదని సీరియస్ అయ్యారు. కాబట్టి కరోనా వ్యాక్సిన్ వచ్చేంతవరకూ అందరూ జాగ్రత్తగా ఉండాలని పవన్ సూచించారు. మరి పవన్ చేసిన ఈ తరహా వ్యాఖ్యలను జగన్ పార్టీ నాయకులు సూచనల తీసుకుంటారో లేకపోతే విమర్శలుగా తీసుకుంటారో చూడాలి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: