కరోనా విషయంలో రోజు రోజుకు వచ్చే అప్‌డేట్స్ చూస్తుంటే బుర్ర గిర్రున తిరిగి పోతుంది. తల గోడకేసి బాదుకోవాలని అనిపిస్తుంది. చాకిరేవు బండ దగ్గర విడిచిన గుడ్డలు ఉతికినట్లుగా మనుషులను కరోనా ఉతికి ఆరేస్తుంటే గిల గిలలాడిపోతున్నారు దాదాపుగా అందరు. అసలే ప్రతి వారిలో ఎన్నో అనుమానాలను కలిగిస్తున్న ఈ కరోనా వల్ల మనుషులకు స్వేచ్చ లేకుండా పోయింది.


ఇదివరకు గుట్కాలు, పాన్లు నమిలి ఎక్కడపడితే అక్కడ ఉమ్మేసే వారు. తుమ్ము, దగ్గులాంటివి వచ్చినా స్వేచ్చగా పని కానిచ్చే వారు. ఇక జ్వరం వచ్చిన వారైతే ఇంట్లో పడుకోకుండా వీలైతే అలా షికార్లు చేసే వారు, లేదా పక్కన ఒకర్ని కూర్చో బెట్టుకుని సొల్లు వేసే వారు. కానీ కరోనా వల్ల అంతా తలకిందులై పోయింది. ఇలాంటి సమయంలో గోకుల్ చాట్‌లో బాంబు పెలినట్టు ఉండే వార్త ఒక పరిశోధనలో తేలిందట. అదేమంటే మరక మంచిదే అన్నట్లుగా సాధారణ జలుబు కరోనా వైరస్‌ను ఎదిరించే ఇమ్యూనిటీ పెంచుతుందని ఓ కొత్త అధ్యయనంలో తేలిందట.


ఎవరిలోనైనా కరోనా వైరస్ బారిన పడక ముందే జలుబు వస్తే కంగారు పడాల్సిన అవసరం లేదని, శరీరంలో వ్యాధి నిరోధక శక్తికి అసలు పని మొదలైందని అర్థం అంటున్నారు పరిశోధకులు.. మనిషి శరీరంలోకి ఏదైనా వైరస్ ప్రవేశించినప్పుడు, ఈ వ్యాధి నిరోధక వ్యవస్థ వెంటనే అప్రమత్తం అయ్యి వైరస్ కు వ్యతిరేకంగా పోరాడుతుందట. ఇక మనకు వచ్చే జలుబుకు కారణమైన వైరస్ లు కూడా కరోనా కుటుంబానికి చెందినవే అంటున్నారు వీరు...


వాస్తవానికి సార్స్ కోవిడ్-2 మొదట కరోనావైరస్ కాదు. కానీ వాటిలో ఉన్న కొన్ని సాధారణ బాక్టీరియాలు జలుబుకు కారణమవుతాయట. ఇకపోతే లా జోల్లా ఇన్స్టిట్యూట్ ఫర్ ఇమ్యునాలజీ ప్రొఫెసర్ అలెస్సాండ్రో సెట్టే తన కెరీర్లో 35ఏళ్లకు పైగా, రోగ నిరోధక ప్రతిస్పందనను అర్థం చేసుకోవడానికి, రోగనిరోధక చర్యలపైనే లోతుగా అధ్యయనం చేస్తున్నారట..


కాగా జలుబుకు కారణమయ్యే కరోనా వైరస్‌లు నాలుగు రకాలుగా ఉన్నాయంటున్నారు. అవి 229E, NL63, OC43, HKU1 ఇవి కూడా కరోనా కుటుంబానికి చెందినవి.. అయితే వీటి వల్ల తేలికపాటి నుండి ఒక మోస్తారు వరకు శ్వాసకోశ వ్యాధులు రావడానికి అవకాశం ఉందట. ఒక రకంగా ఇవి రోగనిరోధక కణాలుగా పనిచేస్తాయని వారు గమనించారట.


కొంతమంది రోగ నిరోధక వ్యవస్థలు మునుపటి కరోనా వైరస్‌తో పాటుగా ప్రస్తుతం ఉన్న కోవిడ్-19కు కూడా ప్రతిస్పందించ గలవని యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, నెదర్లాండ్స్, జర్మనీ, సింగపూర్ దేశాల రోగులపై చేసిన అధ్యయనాల ద్వారా తెలిసిందట. అంటే మనిషిలో ఉండే ఇమ్యూనిటీ సిస్టం సరిగ్గా ఉంటే ఏ వైరస్ కూడా ఏం చేయలేదనేది ఇక్కడ అర్ధం అవుతుంది. అందుకే అడ్డమైనవి తిని రోగాలు తెచ్చుకునే కంటే, రోగనిరోధక శక్తిని పెంచే వాటిని స్వీకరిస్తూ ఆరోగ్యంగా జీవించడం అలవాటు చేసుకోవాలని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: