అసలు లోకంలో ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్దితి ఉంది. కరోనా కనికరం లేకుండా అందరికి వ్యాపిస్తున్న దశలో, సరైన రక్షణ చర్యలు ప్రజలు పాటించడం లేదు. నా వాళ్లకు ఏమైందో అని పరామర్శించడానికి వెళ్ళి ఈ వైరస్ బారిన పడుతున్నారు.. ఇలాంటి సమయంలో ఈ విద్యాసంవత్సరం పూర్తిగా అటకెక్కింది. దీని విషయంలో తల్లిదండ్రులు కరోనా తగ్గే వరకు పిల్లలను స్కూళ్లకు పంపమని తెలుపుతుండగా, కొన్ని స్కూళ్ల యజమాన్యాలు ఇప్పటికే ఆన్‌లైన్ క్లాసులను నిర్వహిస్తున్నాయి. కాగా ఇదే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న పాఠశాలలను ప్రారంభించడానికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి.


ఈ నేపధ్యంలో తల్లిదండ్రులను క‌ల‌వ‌రానికి గురిచేసే ఒక వార్త వెలువ‌డింది. అదేమంటే యూఎస్‌లో జూలై చివరి 15 రోజుల్లో సుమారుగా 97,000 మంది పిల్లలు కరోనా బారిన పడ్డారట. ఈ విషయాన్ని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్  ఒక నివేదికలో వెల్ల‌డించింది. ఇప్పటికే అమెరికాలో క‌రోనాకు అడ్డూదుపు లేకుండా పోతుంది. కాగా ఈ వైరస్ సోకిన‌ 50 లక్షల బాధితుల‌లో 3 లక్షల 38 వేల మంది పిల్లలు ఉన్నారని ఆ నివేదిక పేర్కొనడం ఆందోళన కలిగించే విషయమే..


ఇంతలా ఈ వైరస్ విజృంభిస్తున్న క్రమంలో కొంత మంది నిపుణులు పాఠశాలల‌ను తెర‌వ‌డంపై చ‌ర్చ‌లు ప్రారంభించారట. ఇకపోతే ఒక్క జూలైలోనే అమెరికాలో క‌రోనా వైరస్ కారణంగా సుమారు 25 మంది చిన్నారులు మృత్యువాత ప‌డ్డారట. ఇలాంటి నేప‌ధ్యంలో త‌మ పిల్ల‌ల‌కు ఆన్‌లైన్ క్లాసులే మేల‌ని త‌ల్లిదండ్రులు భావిస్తున్నారు.


కాగా ప్రపంచంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 1.98 మిలియన్లను దాటింది. వీరిలో అత్య‌ధికంగా 51,50,060 మంది క‌ర‌నా బాధితులు అమెరికాలో ఉండ‌గా, భారత్‌లో 30,13,369 మంది, బ్రెజిల్‌లో 21,53,010 మంది ఉన్నారు.. ఇక ఈ సంవత్సరం పూర్తైయ్యే లోపు ఇంకెన్ని దారుణ సంఘటనలను చూడవలసి వస్తుందో అని అనుకుంటున్నారట జనం..


మరింత సమాచారం తెలుసుకోండి: