చెన్నై: జీవితం అనేది చాలా చిన్నంది. ఒక్క సారి ప్రాణాలు పోతే తిరిగి రావు. ఉన్న ఈ చిన్న జీవితాన్ని ఎంతో ఆనందంగా జీవించి పోవాలి. కానీ.. చాలా మంది చిన్న చిన్న కారణాలతోనే ప్రాణాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు స్వల్ప కారణాలకే మనస్తాపం చెంది విలువైన ప్రాణాలను బలి చేసుకుంటున్నారు. పబ్జీ గేమ్ కారణంగా దేశంలో ఎంత మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారో అనేక వార్తలు చూశాం. ఇక ఇదిలా ఉంటే.. తాజాగా తమిళనాడులో ఓ విద్యార్థి చాలా చిన్న కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అరుంబాక్కం వినాయక పురానికి చెందిన సంజయ్ కుమార్ అనే 15 ఏళ్ల విద్యార్థి మదదుర వాయాల్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూలులో చదువుకుంటున్నాడు.

మంగళవారం రోజూ వెళ్లేలాగానే ఆ రోజు కూడా ఎంతో ఆనందం, ఉత్సాహంతో స్కూలుకు వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన సంజయ్ కుమార్ తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఎంత సేపు గడిచినా బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం కలిగింది. తలుపు కొట్టినా తీయలేదు. దీంతో తల్లిదండ్రులు తలుపులు బద్దలు కొట్టి లోపలకు వెళ్లగా.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. లోపల సంజయ్ కుమార్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమ పిల్లోడు ఎందుకు ఉరి వేసుకున్నాడో తెలియక తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచార మిచ్చారు. అధికారులు సంజయ్ కుమార్ మృతదేహానికి పోస్టు మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అనంతరం సంజయ్ కుమార్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో దర్యాప్తు జరిపారు. దర్యాప్తులో కారణం తెలుసుకున్న పోలీసులు, తల్లి దండ్రులు కంగుతిన్నారు. సంజయ్ కుమార్ మంగళవారం స్కూలుకు వెళ్లిన సమయంలో జుట్టు ఎక్కువగా ఉందంటూ ఉపాధ్యాయుడు అతడిని మందలించాడు. వెంటనే జుట్టు కత్తిరించుకోవాలని విద్యార్థుల ముందే తిట్టాడు. దీంతో సంజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే.. సంజయ్ కుమార్ తాను చదువుతున్న క్లాసులోనే ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని, ఆమె తన ప్రేమను అంగీకరించకపోవడంతోనే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: