
తెలంగాణలో మంచి ఉద్యోగం రావడం లేదని రాజేష్ ఉపాధిని వెతుక్కుంటూ గత ఏడాది దుబాయికి వెళ్లాడు. దుబాయి వెళ్లిన తర్వాత కూడా వారి మధ్య ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు.. పైగా మరింత పెరుగుతూ వచ్చింది. త్వరలోనే భారత్‌కు తిరిగి వస్తానని, ఇద్దరం పెళ్లి చేసుకుందామని యువతికి రాజేష్ చెప్పాడు. అయితే ఇటీవల వారిద్దరి ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలిసిపోయింది. ఇద్దరికి వివాహం జరిపించే అవకాశమే లేదంటూ తేల్చి చెప్పారు. దీంతో యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. రాజేష్‌తో వివాహం జరగకపోతే తాను బతికి ఉండటం కూడా వృధా అని భావించింది.
రాజేష్‌ను మర్చిపోలేక ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకుంది. ఆమె చనిపోయిన కొద్ది గంటల తర్వాత రాజేష్‌కు స్నేహితులు ఫోన్ చేసి ప్రేయసి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. దీంతో రాజేష్ నోట మాట రాలేదు. తన ప్రేయసి లేని జీవితం తనకు మాత్రం ఎందుకు అని అనుకున్నాడు. అంతే.. తాను ఉంటున్న గదిలోనే ఉరేసుకుని తాను కూడా ప్రేయసి వద్దకు వెళ్లిపోయాడు. రాజేష్ ఉరి వేసుకునే ముందు ఓ సెల్ఫీ వీడియో తీసుకుని తన తల్లికి పంపించాడు. ప్రస్తుతం ఈ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.