పార్టీలోని హేమా హేమీలు ఆ పదవి కోసం పోటీ పడుతున్నారు. తమకు దక్కుతున్న ఏకైక ఎమ్మెల్సీ పదవి అదే కావడంతో ఎవరికి వారు దాన్ని దక్కించుకోవడానికి పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలోకాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. మాజీ పీసీసీ చీఫ్ లు, మాజీ మంత్రులు ఇలా అనేక  మంది ఇప్పుడు ఒక్క ఎమ్మెల్సీ సీటుపై దృష్టి సారించారు. ఎమ్మెల్యేల కోటాలో జరిగే ఈ ఎమ్మెల్సీ ఎన్నిల ద్వారా దాన్ని తామే దక్కించుకోవాలని వారు భావిస్తున్నారు.


మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి.

Image result for speaker suresh reddy

చాలా కాలంగా పదవులకు దూరంగా ఉన్న మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి.. ఇటీవలే ఎమ్మెల్సీ పదవీకాలాన్ని పూర్తి చేసుకొన్న మాజీ పీసీసీ చీఫ్ డి. శ్రీనివాస్, మరో మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తో సహా అనేక మంది ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కోసం ట్రయల్స్ వేస్తున్నారు. వీరందరి ట్రయల్స్ ఇలా ఉంటే.. ఆ పదవిని మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి తన్నుకపోయే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి!

సునీతకు దక్కే అవకాశం


అధిష్టానం ఈ సారి ఎమ్మెల్సీ పదవిని మహిళకు కేటాయించాలని భావిస్తోంది.. ఆ కోటాలో అధి సునీతకు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. మాజీ మంత్రి అన్న ట్యాగ్. ఇప్పుడు కూడా పార్టీ కార్యక్రమాల్లోక్రియాశీలకంగా పాల్గొనడాలు ఆమెకు ఉన్న అర్హతలుగా తెలుస్తోంది.  పార్టీలో ఎమ్మెల్సీ ఆశావహులు  ఎంతో మంది ఉన్నా.. వారెవరూ అంత యాక్టివ్ గా పనిచేయడంలేదు. దీంతో వారికి పదవి ఇవ్వడం కన్నా.. సునీతకు ఇవ్వడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చింది అధిష్టానం.ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి మీద ఆశలు పెట్టుకొన్న వారికి పార్టీ పరంగా మంచి పదవులు ఇస్తామని.. వాటి ద్వారా వారు తమ సత్తాను చాటుకోవాలని అధిష్టానం సూచిస్తోంది. మరి కాంగ్రెస్ సీనియర్ నేతలు దానికి రెడీనేనా?! 


మరింత సమాచారం తెలుసుకోండి: