టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి మాట్లాడిన బాషా అసభ్యంగా ఉంది అన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి. నిస్పృహలో టీడీపీ నేతలు ఉన్నారు అని ఆయన ఆరోపించారు. లోకేష్,చంద్రబాబు కావాలని భూతులు తిడుతున్నారని పేర్కొన్నారు. టీడీపీ నేతలు అసభ్యంగా మాట్లాడుతూన్నా మేము ఎప్పుడు స్పందించలేదు అని పట్టాభి నోరు జారీ మాట్లాడిన మాటలు కాదు అన్నారు ఆయన. ప్రీ ప్లాన్డ్ గా ప్రిపేర్ అయి కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడారు అని పేర్కొన్నారు. రిపీటెడ్ గా ఒక భూతు పదాన్ని సీఎంను టార్గెట్ చేసి పట్టాభి ఉపయోగించడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటి ? అని ఆయన ప్రశ్నించారు.

పట్టాభి వ్యాఖ్యల వెనుక చంద్రబాబు హస్తం ఉంది అన్నారు. భూతులు ఎవరు మాట్లాడిన ఏ పార్టీ వారు తిట్టినా తప్పే అని మా కర్మ కాలి ఏపీలో టీడీపీ ప్రతిపక్ష పార్టీ అయ్యింది అని పేర్కొన్నారు. ప్రత్యక్ష ప్రజా రాజకీయాలు చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదు అని ఆరోపించారు. పట్టాభి చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై అభిమానం ఉన్న వాళ్ళు ఏదో ఒక రకంగా రియాక్ట్ అవుతారు అని అన్నారు. ఆర్గనైస్డ్ గా మొత్తం వ్యవహారాన్ని నడిపింది చంద్రబాబు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ప్రజల్లోకి అభివృద్ధి సంక్షేమం వెళ్లకుండా రెండున్నారేళ్లుగా పక్కదారి పట్టిస్తున్నారు అని మండిపడ్డారు.

గంజాయి రవాణాపై ఆనందబాబు చేసిన వ్యాఖ్యలకు పోలీసులు వివరణ  అడగకూడదా అని నిలదీశారు. అక్రమ కేసులు పెట్టి ఎమ్మెల్యే రోజా,చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వేధించినట్లు పోలీసులు ఆనందబాబును వేధించారా అని నిలదీశారు. టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై జోగి రమేష్ తప్పని చెప్పడం కోసం వెళ్తే దాడి చేశారు అని అన్నారు. ఆర్గనైస్డ్ గా ఒక కార్యక్రమాన్ని చంద్రబాబు నడుపుతున్నారు  అని విమర్శించారు. చెత్త నా కొడుకు అని అయ్యన్నపాత్రుడు సీఎం జగన్ ను ఉద్దేశించి మాట్లాడారు అని అధికారం పోయిందన్న ఉక్రోషంతో భూతులు తిడుతున్నారు అని విమర్శించారు. సీఎంను ఉద్దేసించి మాట్లాడిన మాటలకు అభిమానులు అలా రియాక్ట్ అయ్యారు అని పార్లమెంటరి వ్యవస్థలో ఇటువంటి వ్యాఖ్యలకు ఎక్కడా చోటు లేదు చెత్త నా కొడుకులు అన్నప్పుడే చెత్తలో వేసి తొక్కే వాళ్ళం అన్నారు. టీడీపీ నేతలు ఇలాగే భూతులు తిడితే ఇకపై రియాక్షన్ వేరేలా ఉంటుంది అని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp