గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కువ వివాదాల్లో కనిపించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే...అది చింతమనేని ప్రభాకర్ మాత్రమే. అసలు ఈయన ఎన్ని వివాదాల్లో ఉన్నారో చెప్పాల్సిన పని లేదు. ఆఖరికి సొంత ప్రభుత్వంలోనే ఈయనపై కేసులు నమోదయ్యాయంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే చింతమనేనిని ఓడించాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నించింది. అటు పవన్ కల్యాణ్ సైతం చింతమనేనిపై బహిరంగంగానే విమర్శలు చేశారు. ఆయన్ని ఎలాగైనా ఓడిస్తానని శపథం కుడా చేశారు.

అయితే అన్నిరకాలుగా నెగిటివ్ పెరగడంతో దెందులూరు బరిలో చింతమనేని ఓటమి పాలయ్యారు. కాకపోతే వైసీపీ గాలిలో ఓడిపోయారు తప్ప, పవన్ కల్యాణ్ ప్రభావంతో మాత్రం ఓడిపోలేదని చెప్పొచ్చు. ఎందుకంటే పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలోని మెజారిటీ నియోజకవర్గాల్లో జనసేన ఓట్లు చీల్చేయడం వల్ల టీడీపీ అభ్యర్ధులు ఓటమి పాలయ్యారు...అలాగే వైసీపీ విజయాలు సాధించింది.

కానీ పశ్చిమ గోదావరిలో ఉన్న దెందులూరుపై జనసేన ప్రభావం పడలేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో చింతమనేనిపై వైసీపీ నేత అబ్బయ్య చౌదరీ 16 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే ఇక్కడ జనసేనకు పడిన ఓట్లు ఆరు వేలు. అంటే దెందులూరులో జనసేన ప్రభావం పెద్దగా లేదని చెప్పొచ్చు.  అందుకే ఒకవేళ నెక్స్ట్ పవన్, టీడీపీతో కలిసినా సరే చింతమనేనికి మాత్రం పెద్దగా ఉపయోగం ఉండదనే చెప్పాలి. ఇక్కడ చింతమనేని పూర్తిగా తన సొంత బలం, టీడీపీ ఇమేజ్‌తోనే గెలవాలి తప్ప, పవన్ కల్యాణ్ అవసరం మాత్రం ఉండదు.

కానీ పశ్చిమలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలకు పవన్ అవసరముంది. గత ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో జనసేనకు భారీగానే ఓట్లు పడ్డాయి. అలాంటి నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు గెలవాలంటే ఖచ్చితంగా పవన్ మద్ధతు కావాలి. దెందులూరులో మాత్రం చింతమనేనికి పవన్ అవసరం పడదు. అయితే ఇప్పటికే దెందులూరులో చింతమనేని పికప్ అయినట్లు తెలుస్తోంది. నెక్స్ట్ ఎన్నికల్లోపు ఇంకా బలపడే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: