అధికారం పోయింది,ఆస్తులు కరిగిపోయాయి, అప్పులు మిగిలాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దుస్థితి ఇది. ఒకప్పుడు అమెరికాలో అత్యంత సంపన్నుల్లో ఒకరిగా నిలిచిన ట్రంప్ ఇప్పుడు అందినకాడికి ఆస్తులు అమ్ముకుంటున్నారు. వ్యాపారంలో లక్షల కోట్లు గడించి ఆ సంపద సోపానంగా అధ్యక్షునిగా ఎన్నికైన ట్రంప్ ఇప్పుడు అయ్యయ్యో చేతులు ఖాళీ ఆయనే అంటూ పాడుకోవల్సిన దుస్థితి ఏర్పడింది. భారీ వ్యతిరేకత మధ్య అమెరికా అధ్యక్షునిగా ఎన్నికై అదే వ్యతిరేకత మధ్య నాలుగేళ్లు పదవిలో కొనసాగిన ట్రంపు వైట్ హౌస్ ను వీడేటప్పుడు అనేక వివాదాలకు కేంద్రబిందువు అయ్యారు. ట్రంపు వ్యాపారాలకే తప్ప రాజకీయాలకు పనికి రారన్న ముద్ర వేయించుకున్నారు. కానీ పదవి పోగొట్టుకున్న ఏడాదిలోపే ట్రంపును మరిన్ని కష్టాలు చుట్టుముట్టాయి. ఒకప్పుడు అత్యంత సంపన్న, విజయవంతమైన వ్యాపారిగా గుర్తింపు ఉన్న ట్రంపు ఇప్పుడు అయిన కాడికి ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి లో కూరుకుపోయారు.

 వైట్ హౌస్ నుంచి వచ్చేశాక ముందు కార్లు, విమానాలు అమ్మకున్న ట్రంపు తాజాగా తన కుటుంబానికి చెందిన భారీ హోటళ్లను విక్రయించేస్తున్నారు. వాషింగ్టన్ లోని ట్రంపు ఇంటర్నేషనల్ హోటల్ ను విక్రయించేందుకు డీల్ కుదుర్చుకున్నారు. భవిష్యత్తులో ఈ హోటల్ పేరు వాల్ డోర్ ఆస్టోరియా గా మారనుంది. దీన్ని హిల్టన్ గ్రూప్ నిర్వహించనుంది. రెండు వందల అరవై మూడు గదులు ఉన్న ఈ భవనాన్ని ట్రంపు ఆర్గనైజేషన్ 60ఏళ్ల లీజ్  కు తీసుకుంది. 2016లో ఈ హోటల్ కార్యకలాపాలను ప్రారంభించింది. కరోనా కారణంగా భారీ నష్టాలు రావడంతో అమ్ముకోవడం తప్ప ట్రంపుకు మరో దారి లేకుండా పోయింది. దాదాపు 2790 కోట్లకు దీన్ని హిల్టన్ గ్రూప్ కొనుగోలు చేసింది. అయితే ట్రంపు మద్దతుదారులు మాత్రం ఇలాంటి ఎత్తుపల్లాలు ఆయనకు సహజమేనని  అంటున్నారు. వ్యాపార రంగంలో రారాజుగా ఎదిగే క్రమంలో ఆయనకు విజయాలతో పాటు అపజయాలు ఎదురాయ్యాయని గుర్తు చేస్తున్నారు. కాసినో వ్యాపారంలో గతంలో ట్రంపు ఐదుసార్లు దివాలా తీశారని కానీ ఆ నష్టం నుంచి కోలుకొని మళ్లీ లాభాలు గడించారని ఈసారి అదే జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: