
ఇటు ఏపీలో పార్టీ తీవ్ర కష్టాల్లో ఉంది...అందుకే కష్టాల్లో ఉన్న పార్టీని పైకి లేపాలంటే జూనియర్ ఎన్టీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలని డిమాండ్ ఎక్కువగా వస్తున్న విషయం తెలిసిందే. పార్టీలో కొందరు కార్యకర్తలు ఈ డిమాండ్ గట్టిగా చేస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు పని అయిపోయిందని, లోకేష్‌కు పార్టీని నడిపించే సామర్థ్యం లేదని, కాబట్టి టీడీపీని నందమూరి కుటుంబానికి అప్పగించేయాలని...కొందరు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు.
అయితే ఈ మాటలన్నీ జరిగే పని కాదని చెప్పొచ్చు. చంద్రబాబు అంత తేలికగా పార్టీని వేరే వాళ్ళకు అప్పగించడం జరగదు. కాకపోతే నందమూరి ఫ్యామిలీకి కాస్త ప్రాధాన్యత ఇవ్వాలనేది...కొందరు టీడీపీ కార్యకర్తల డిమాండ్...లేదా ఫ్యామిలీని దగ్గర చేసుకుంటే పార్టీకి బెనిఫిట్ అంటున్నారు. ప్రస్తుతానికి పార్టీలో నందమూరి బాలకృష్ణ ఒక్కరే ఉన్నారు. కాబట్టి ఇంకా ఫ్యామిలీ సభ్యులని పార్టీలోకి తీసుకురావాలని కోరుతున్నారు.
అటు హరికృష్ణ కుమార్తె...ఎన్టీఆర్ సోదరి సుహాసిని తెలంగాణ రాజకీయాల్లో ఉన్నారు. అక్కడేమో పార్టీ పరిస్తితి ఘోరంగా ఉంది. అలాంటప్పుడు ఆమెని అక్కడ ఉంచడం కంటే ఏపీ రాజకీయాల్లోకి తీసుకొస్తే బెటర్ అనే డిమాండ్ వినిపిస్తుంది. అయితే ఈ ఛాన్స్ కూడా లేదని తెలుస్తోంది. ఆమెని తెలంగాణ రాజకీయాలకే పరిమితం చేస్తారని టాక్. ఇక వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ తరుపున ఆమెని బరిలో దింపుతారని తెలుస్తోంది. అది కూడా గత ఎన్నికల్లో ఓడిపోయిన కూకట్‌పల్లి బరిలోనే దింపే అవకాశాలు ఉన్నాయని సమాచారం. పోటీ చేయొచ్చు గానీ..గెలుపే టీడీపీకి గగనం.