రోజంతా కష్టపడి పనిచేసేవాడు పూటకు లేదా నెలకు సంపాదన పొందుతూ, దానిలోనే అన్ని ఖర్చులు సర్దుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నాడు. వీరందరూ సమాజంలో విలువలు, కట్టుబాట్లను పాటిస్తూ ఉంటారు. ఇంకో మాటలో చెప్పాలంటే ధర్మబద్దమైన సంపాదన చేస్తూ పోతుంటారు. అవన్నీ పట్టని వాళ్ళు తోచిన మరో దారి వెతుక్కుంటూ అలాగే సంపాదిస్తూ, దానితో విలాసవంతంగా బ్రతికేస్తూ ఉంటారు. కొందరు ధైర్యంగా ముందడుగు వేసి, కఠిన మైన నిర్ణయాలు తీసుకుంటూ గొప్పగా ఎదిగిన వారు కూడా ఈ విలాసవంతమైన జీవితాలను అనుభవించలేరు. ధర్మం తప్పిన వాళ్లకు అడ్డుఅదుపు ఉండబోదు కాబట్టి, తోచిన విధంగా సంపాదించడం, దానితో విచ్చలవిడిగా బ్రతికేయడం చేస్తున్నారు. ఈజీ మనీ వీళ్లకు టానిక్ లాంటిది. దానిలో ఆరితేరినవాళ్లు వీళ్లంతా.

ఎక్కడి నుండో వస్తారు, చటుక్కున అందరిలో కలిసిపోతారు. మనవాడే అనిపించేసుకుంటారు. అదే వాళ్లకు కావాల్సింది, అక్కడ నుండి మొదలుపెడతారు వాయించడం. మాయమాటలు చెప్పి దొరికినంత లాగేస్తారు. వీళ్ళ చేతిలో చిన్న వారు కాదు సెలెబ్రిటీలు, నేతలు లాంటి పెద్ద పెద్ద చేపలే పడిపోతారు. మరి నోట్లకట్టలు వెళ్లవద్దనే కదా ఉండేది. అందుకే మోసగాళ్లకు వాళ్ళే లక్ష్యంగా ఉంటారు. వాళ్ళు దండుకున్నంత దండుకోని పారిపోయి ఎక్కడో జల్సా చేస్తుంటారు. వీళ్లకు మోసపోయినట్టు తెలిసే సరికే ఆ కాస్త ఖర్చుకూడా అయిపోయిఉంటుంది. పొరపాటున దొరికిపోయినా, మంది సొమ్మే కాబట్టి దానినే లంచంగా ఇస్తూ, దర్జాగా బయటకు వచ్చేస్తారు. ఇటీవల ఇలాంటి చేప ఒకటి అధికారుల చేతికి చిక్కింది.

చేప ను జైలులో పెట్టినప్పటికీ, వారిని కలవడానికి సెలెబ్రిటీలు, నేతలు క్యూ కట్టరట. వాళ్ళు తనను కలవడానికి ఏ ఆటంకము లేకుండా ఉండటానికి, తనకు జైలులో అన్ని సౌకర్యాలు కల్పించడానికి అక్కడ అధికారులకు నెలకు ఆ చేప అక్షరాలా రెండు కోట్లు లంచం ఇస్తుందట. కేవలం మొబైల్ వాడకానికే 60లక్షలు ఇస్తుందట. ఎవడి సొమ్ము ఎవడు ఖర్చుపెడుతున్నాడో కదా. ఇలాంటివారికి ఎక్కడైనా విలాసవంతమైన జీవితమే కాబోలు. ఇవన్నీ చూస్తుంటే, ఎవరికైనా మనసు చెదిరి, వీళ్ళ మాదిరే అయిపోవాలని ఖచ్చితంగా అనిపిస్తుంది. అది మన లా అండ్ ఆర్డర్. అంతా అలా లేకపోయినా, ఎక్కువ ప్రభావం వీళ్ళవలనే అనేది మాత్రం నిజం. దీనిలో మార్పులు వస్తేనే అన్ని వర్గాలు మంచి మార్గాన్ని ఎంచుకునే అవకాశాలు ఉంటాయి. ఆ చేప పేరు సుఖేష్ చంద్రశేఖర్ అంట. కాకిలాగా కలకాలం బ్రతికేకంటే, కోకిలలాగా కొద్ది కాలమే బ్రతికిన చాలు అంటారు. అయితే ఏది కాకో, ఏది కోకిలో అర్ధం చేసుకునే స్థితి ఆ సందర్భాలు ఇవ్వకపోవచ్చు. అందుకే ఈ పరిస్థితులు మారితేనే యువత ముఖ్యంగా మారుతుంది, దేశం బాగుపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: