
ప్రస్తుతం ఈ ఉద్యమాన్ని వాడుకుని తమకు అడ్డుగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను పదవి నుండి దించేసి తమకు అనుకూలంగా ఉన్నవాళ్లకు ఆ పట్టం కట్టాలని తెహ్రికి తాలిబన్ లు చూస్తున్నారు. ఈ ఉద్యమంలో వాళ్ళు కూడా కలిసిపోయి, అటు పాక్ పౌరులకు సంఘిభావం తెలిపినట్టుగా తెలుపుతూ, వీలైనప్పుడల్లా పాక్ సైన్యంపై విరుచుకుపడుతుంది. పాక్ సైన్యం కూడా రెండుగా విడివడిన విషయం తెలిసిందే. ఒకరు చైనాకు వ్యతిరేకంగా, తీవ్రవాదులతో కలిసిపోయారు. ఇంకొకరు చైనా, పాక్ తో కలిసి పని చేస్తున్నారు. చైనాకు వ్యతిరేకంగా ఉన్న సైన్యం కూడా ఈ ఉద్యమానికి ఆజ్యం పోస్తుంది.
ఇలా పాక్ లో నిరంతరం ఇమ్రాన్ కు నిప్పుల కొలిమిలా ఉంది. ఒకపక్క అనేక సంక్షోభాలు మరోపక్క దేశంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని స్థితి. స్వయంగా ఇమ్రాన్ తన దేశాన్ని నడిపించడానికి కూడా ఆర్థికస్తోమత లేదని ఇటీవల బహిరంగంగానే ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. ఈ సమయంలో అమెరికా ఏమైనా సాయం చేస్తుందేమో అని ప్రయత్నాలు చేస్తున్నారు పాక్ విదేశాంగ మంత్రి. ఈ పరిస్థితులలో కూడా పాక్ మాత్రం భారత్ పై గుర్రుగానే ఉండటం చుస్తే వాళ్ళ మూర్ఖత్వం ఎంత పెరిగిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే తీవ్రవాదప్రేరేపిత దేశంగా పాక్ ముద్రపడింది, అందుకే దానికి అంతర్జాతీయంగా కూడా కనీసం అప్పుపుట్టే పరిస్థితి లేదు.