మొదట నుంచి ఎస్సీ, ఎస్టీ రిజర్వడ్ నియోజకవర్గాల్లో వైసీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఆ నియోజకవర్గాల్లో వైఎస్సార్ అభిమానులు ఎక్కువగా ఉన్నారు...దీంతో మొదట నుంచి ఆ నియోజకవర్గాలు కాంగ్రెస్‌కు, ఇప్పుడు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. గత రెండు ఎన్నికల్లో కూడా ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో వైసీపీ సత్తా చాటింది. గత ఎన్నికల్లో అయితే వైసీపీ క్లీన్‌స్వీప్ చేసినంత పనిచేసింది. రాష్ట్రంలో 29 ఎస్సీ స్థానాలు ఉండగా, ఇందులో 27 వైసీపీ, ఒకటి టీడీపీ, ఒకటి జనసేన గెలుచుకున్నాయి.

ఇక 7 ఎస్టీ స్థానాలు ఉంటే...ఏడు కూడా వైసీపీనే గెలుచుకుంది. అంటే రిజర్వడ్ స్థానాల్లో వైసీపీకి ఎంత పట్టు ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ పట్టు మెల్లిగా జారుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఏపీలో ఎక్కువ రిజర్వడ్ స్థానాల్లోని ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారు. ఒకసారి ఎస్టీ స్థానాలు విషయానికొస్తే...వైసీపీ ఎమ్మెల్యేలకు ఎదురుగాలి వీస్తున్నట్లే కనిపిస్తోంది.

గత ఎన్నికల్లో ఎస్టీ స్థానలైన పాలకొండ, కురుపాం, సాలూరు, అరకు, పాడేరు, రంపచోడవరం, పోలవరం స్థానాలని వైసీపీ గెలుచుకుంది. ఇప్పుడు ఆయా స్థానాల్లో వైసీపీపై వ్యతిరేకత కనిపిస్తోంది. పాలకొండలో ఎమ్మెల్యే కళావతికి అంత అనుకూలమైన వాతావరణం కనిపించడం లేదు. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈమెపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉంది. అటు కురుపాంలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి పరిస్తితి కూడా మెరుగ్గా లేదు.

అలాగే పాడేరులో భాగ్యలక్ష్మీకి పాజిటివ్ తక్కువ ఉంది. ఇక రంపచోడవరంలో ఎమ్మెల్యే ధనలక్ష్మీ పరిస్తితి కూడా అంతే. వరుసగా గెలుస్తూ సత్తా చాటుతున్న సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొరకు కూడా ఈ సారి పరిస్తితి అనుకూలించేలా లేదు. అయితే పోలవరంలో ఎమ్మెల్యే బాలరాజు, అరకులో ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణల పరిస్తితి కాస్త మెరుగ్గా ఉంది. అయితే ఎస్టీ స్థానాలు వైసీపీ కంచుకోటలు కాబట్టి...మళ్ళీ జగన్ గాలి ఆ ఎమ్మెల్యేలని కాపాడే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: