
ఇలా చైనాలో నియంత పాలన సాగిస్తూ శ్రమ దోపిడీ చేస్తూ కఠిన ఆంక్షలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది చైనా ప్రభుత్వం. అదే సమయంలో చైనాలో అవినీతి కూడా రాజ్యమేలుతుంది అన్న విషయం ఇటీవలి కాలంలో బయటపడుతుంది. చైనాలో అవినీతి పెరిగిపోయిందని గతంలో ఏకంగా అక్కడి ప్రభుత్వమే ఒక నివేదిక ఇవ్వడం సంచలనంగా మారిపోయింది. అయితే చైనాలో అవినీతి అక్రమాలకు పాల్పడిన వారు ఇక ఈ బ్లాక్ మని మొత్తం ఇతర దేశాలలో ఉన్న సంస్థల్లో పెట్టుబడిగా పెట్టడం ఇక ఆ తర్వాత విదేశాలకు వెళ్లి జల్సాలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారట. అది కూడా ఇప్పుడిప్పుడే బయట పడుతుంది.
ఈ క్రమంలోనే చైనా కు సంబంధించిన హువాయి కంపెనీలో ఎంతోమంది అక్రమార్కులు పెట్టుబడి పెట్టినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే చైనా కు సంబంధించిన హువాయ్ కంపెనీ పై భారత్ నిషేధం విధించింది అన్న విషయం తెలిసిందే. భారత్ నిషేధం విధించడంతో అటు వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. ఇక ఇప్పుడు అగ్రరాజ్యమైన అమెరికా కూడా భారత్ బాటలో నడిచింది. గతంలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ కొనసాగిన సమయంలో పెట్టిన ఆంక్షలు కాస్త ఇప్పటికే చైనాకు భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి. చైనా కు సంబంధించిన హువాయ్ కంపెనీ పై గతంలో ట్రంప్ పెట్టిన ఆంక్షలు కొనసాగుతుండడంతో ఇక ఇటీవల ఏకంగా మూడు లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. దీంతో చైనా కు సంబంధించిన అక్రమార్కులు పెట్టిన సొమ్ము మొత్తం ఆవిరి అయింది అని అంటున్నారు విశ్లేషకులు.