ఐదు రాష్ట్రాల పరీక్షలు ప్రధాని నరేంద్ర మోడీకి విషమ పరీక్ష పెడుతున్నాయా? అందులో ఫలితం అటూ ఇటూ అయితే సార్వత్రిక ఎన్నికల్లో మోడీకి దిగులేనా? ఐదు రాష్ట్రాల్లో  మోగింది ఎన్నికల నగారా. మొత్తం 690 అసెంబ్లీ స్థానాలు, 18 కోట్ల 34 లక్షల ఓటర్లు. సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా పాంచ్ పటాకా. ఓమిక్రాన్ విజృంభన  నేపథ్యంలో సవాల్ గా ఐదు రాష్ట్రాల ఎన్నికలు. నరేంద్రమోడీకి ఈ పోల్స్ లిటమస్ టెస్టేనా? ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ తేదీలను ప్రకటించింది.

 ఐదు రాష్ట్రాలు కలిపి ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతుందని  ఈసీ తెలిపింది. ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో ఒక పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రంలో అధికారంలో ఉంది బిజెపినే. దీంతో ఈ రాష్ట్రాల్లో తిరిగి అధికారాన్ని  నిలబెట్టుకోవడం కాషాయానికి ప్రతిష్ఠాత్మకం. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్. అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 403. అధికారంలో ఉంది బీజేపీనే. ఇక్కడ గెలిచిన ఎంపీ సీట్లతోనే ఢిల్లీలో పవర్ లో ఉంది కాషాయం. పార్లమెంటు ఎన్నికల్లో గెలవాలంటే అసెంబ్లీని చేజిక్కించుకోవాలి. ఏదైనా తేడా జరిగితే మాత్రం ఢిల్లీ సింహాసనం షేక్ కావాల్సిందే. అందుకే కొన్ని వారాలుగా యూపీలో అనేక అభివృద్ధి ప్రాజెక్టు పట్టాలెక్కిస్తున్నారు. యోగి, మోడీ కలిసి మళ్లీ మ్యాజిక్ చేస్తారని కొందరంటుంటే, సీట్ల సంఖ్య భారీగా తగ్గక తప్పదని మరికొందరంటున్నారు. ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేకపోవడం తమకు కలిసొచ్చే అంశాలుగా బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఉత్తరాఖండ్ లో అసెంబ్లీ స్థానాలు 70, గోవాలో శాసనసభ సీట్లు 40, మణిపూర్ లో 60 అసెంబ్లీ స్థానాలు ఈ మూడు రాష్ట్రాల్లో పవర్ లో ఉంది బీజేపీనే. గోవా, ఉత్తరాఖండ్ అసెంబ్లీలకు ఫిబ్రవరి14న పోల్ డేట్. వీటిలో అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవడం బిజెపికి సవాల్.

ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉంది. స్థానికంగా పార్టీలో లుకలుకలు తారాస్థాయిలో ఉన్నాయి.వీటన్నింటిలో నరేంద్ర మోడీ ఇమేజ్ ఓవర్ కం చేస్తుందన్నది ఆయా రాష్ట్రాల నేతల కాన్ఫిడెన్స్. మొత్తానికి పంజాబ్ మినహా 5 రాష్ట్రాల ఎన్నికలు బిజెపికి ప్రాణసంకటంగా మారాయి. నిరుద్యోగం, పెట్రోల్ రేట్ల పెంపుపై జనాలు ఎలా స్పందిస్తారో అన్నది మోడీ లో పెరుగుతున్న టెన్షన్. ఈ ఎన్నికల్లో బిజెపి బలం తగ్గిపోతే ప్రతిపక్షాలకు వెయ్యేనుగుల బలమే. మొత్తానికి అటు బిజెపికి,ఇటు కాంగ్రెస్ కు ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విషమ పరీక్ష  ముఖ్యంగా మోడీకి.

మరింత సమాచారం తెలుసుకోండి: