చదువుల తల్లి గా పేరుగాంచిన విశ్వ విద్యాలయాల్లో కొందరు ఆకతాయి విద్యార్థుల చర్యల మూలంగా యూనివర్సీటీలకు చెడ్డ పేరు వస్తోంది. అలాంటి ఘటనే హైదరాబాద్ లోని  ఓ విశ్వ విద్యాలయంలో జరిగింది. యూనివర్సీటీల్లో రాజకీయ పార్టీల చొరబాటు కారణంగా ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంటోంది.
 ఫ్లెక్సీల రగడతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో స్వల్ప ఉద్రికత చోటుచేసుకుంది.  తెలంగాణ రాష్ట్రంలోఅధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల ఫ్లెక్సీలను కొందరు విద్యార్థి నేతలు చించివేశారు. ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు జన్మదినం పురస్కరించుకొని  ఉస్మానియా యూనిర్శిటీ (ఓయూ)లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించాలని  టిఆర్ ఎస్ కు అనుబంధంగా ఉన్న విద్యార్థి యూనియన్ నిర్ణయించింది.  ఈ టోర్నమెంట్ ప్రారంభించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. వారికి స్వాగతం పలికేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా ఓయూ లోని ఇతర విద్యార్థి సంఘాలు ఈ ప్రయత్నాలను అడ్డుకున్నాయి.
 మంత్రుల పర్యటనను అడ్డుకునేందుకు సమాయత్తమైన కొందరు విద్యార్థి నేతలను పోలీసులు ముందుస్తుగా అరెస్ట్ చేశారు. మరికొందరు ఫ్లెక్సీలు చింపేయగా.. పోలీసులు అడ్డుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసిన తర్వాతే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మంత్రులు అడుగుపెట్టాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్ట్స్ కళాశాల వద్ద ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సురేశ్‌.. పెట్రోల్ సీసాతో ఆందోళనకు దిగగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఉస్మానియా యూనివర్సటీలో పట్టు సాధించేందుకు చాలా కాలంగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా విద్యార్థులు ఉద్యమానికి పూర్తి స్థాయిలో అండగా నిలిచారు. కాలగమనంలో టిఆర్ఎస్ కు అక్కడ పట్టు తగ్గింది. మొన్నటి జిహెచ్ ఎంసి ఎన్నికల ప్రచార సమయంలో భారతీయ జనతా పార్టీకి  చెందిన యువ ఎం.పి తేజస్వీ సూర్య కు ఉస్మానియాలో ఘనమైన మద్దతు లబించింది.  దీంతో అక్కడ పట్టుకోసం రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ ఎస్ ప్రయత్నిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ou