
కాళ్ల కిందకు నీళ్లు వస్తేనే మనుషులు పరుగులు తీస్తారా ? లేకా జీవితం పూర్తిగా అస్తవ్యస్తం అయిపోతుంది అని తెలిసి బెదిరి పరుగులు లంకించారా?
ప్రభుత్వం తరఫున తప్పులు లేవా ఉన్నాయి.అదే విధంగా ప్రభాస్ తరఫున మరియు మహేశ్ తరఫున ఇంకా చిరు తరఫున కూడా ఉన్నాయి.సామాన్యుడికి అతి తక్కువ ధరకే వినోదం అన్న నినాదం బాగుంది.అయితే భారీ బడ్జెట్ సినిమా విషయంలో ఇది వర్కౌట్ కాదు.ఎంతవరకూ మొదటి రెండు వారాలవరకూ..తరువాత కథంతా మామూలే!అసలు వంద రోజులు పోయి వారం రోజులు సినిమాలు ఆడడం మొదలు పెట్టాక ఎందుకీ తగాదాలు..కేవలం ఇండస్ట్రీలో లడాయి నడుస్తోంది.బడాయి నడుస్తోంది.
బడాయి కోసమే బడాబాబులు ప్రొడక్షన్ కాస్ట్ పెంచుతున్నారు.అంతా అడుగుతున్నది బాగానే ఉంది.ముఖ్యంగా వైసీపీ శ్రేణులు,జగన్ తరఫు యాక్టివిస్టులు..మీరు సినిమా ప్రొడక్షన్ కాస్ట్ ను ఎందుకు తగ్గించుకోరు అని..మీరెందుకు రెమ్యునరేషన్లు తగ్గించుకోరు అని!హీరో నాని తన సినిమా కోసం ఐదు కోట్లు సర్దుబాటు చేశారు.(శ్యామ్ సింగరాయ్ విడుదల సమయంలో)అదేవిధంగా పెద్ద హీరోల సినిమాలు చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందితే మేలు.రాజమౌళి లాంటి దర్శకులకు మాకు అది చేతగాదు అని చెప్పి ప్రొడక్షన్ కాస్ట్ పెంచుకుంటూ పోవడం అన్నది తగని పని.బడ్జెట్ ను కంట్రోల్ లో ఉంచే కదా! ఆయన మర్యాద రామన్న లాంటి లో కాస్ట్ మూవీ తీశారు.బడ్జెట్ ను అదుపులో ఉంచే కదా ఈగ తీశారు. ఆ రెండూ సాధ్యం అయినప్పుడు మిగతావి ఎందుకు సాధ్యం కాదు.
సెట్స్ లో రీ షూట్ల గోలేంటి? అంటే స్క్రిప్ట్ మీకు రాయడం చేతగావడం లేదా రాసినా పక్కాగా తీయలేకపోతున్నారా? ఒక్కటి చెప్పండి పుష్ప సినిమాకు 180 కోట్లు ఖర్చు చేశారా?ఏమన్నా సమంజసంగా ఉందా? ఆయన (జగన్) భోళా మనిషి కనుక మీ మాట వింటున్నారు కానీ లేకపోతే ఇంకా మిమ్మల్ని నియంత్రించాల్సింది ఉంది అని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.నిజమే!లో బడ్జెట్ మూవీ ఇవాళ నిలబడడం లేదు.ఆ మాట ఆర్ నారాయణ మూర్తి చెబుతుంటే రాజమౌళి ముసి,ముసి నవ్వులు నవ్వుతున్నారు.ఒక్క విషయం వాళ్లకు తెలియదు..జక్కన్న మాట జగన్ వింటారో లేదో కానీ ఆర్ నారాయణ మూర్తి మాట మాత్రం తప్పక వింటారు.ఎందుకంటే ఆయన చెప్పిన వాటిల్లో న్యాయం ఉంది.దోపిడీ లేదు.నిర్హేతుకత లేదు.
ఆ రోజు టికెట్ ధరలపై ప్రస్తావించేటప్పుడు రామకృష్ణారెడ్డి చెప్పినవి కూడా సమంజసం అయిన మాటలే..బాహుబలి విషయమై ఎంత వినోదపు ఎగవేత చేశారో మరిచిపోయారా? ఆ లెక్కలు బయటకు తీస్తే ఆర్కా మీడియా ఏమైపోతుందో? రాజమౌళి ఏమైపోతారో? ఇప్పటికిప్పుడు టికెట్ ధరల విషయమై సవరణలు చేసినా కూడా రేపటి వేళ భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ఇండస్ట్రీ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిందే..కాస్ట్ అండ్ క్రూని కంట్రోల్ చేయకుండా సినిమాలు తీస్తామంటే ఏ ప్రభుత్వం మాత్రం ఒప్పుకుంటుంది.ఆ రోజు చంద్రబాబును బాగానే ప్రసన్నం చేసుకున్నారు కనుక బాహుబలి అన్ని కోట్ల రూపాయల లాభాలను చూసింది.ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విషయ
ఓ సందర్భంలో ఆయన తెలుగు వెర్షన్ పై ఆశలు వదులుకుని,ఇక్కడి బిజినెస్ పై ఇక వచ్చేదేమీ ఉండదని తేలిపోయాక ఉత్తరాది పై కాన్సన్ట్రేషన్ చేశారు అన్నది కూడా వాస్తవం.కానీ ఒమిక్రాన్ అనే వేరియంట్ రాక పుణ్యమాని ఉత్తరాదిలో కూడా థియేటర్ల మూతతో ఆయన అనుకున్నవేవీ సాధ్యం కాలేదు.ఇప్పటికైనా చిన్న సినిమాలను బతకనివ్వాలి..అందుకు మెగాస్టార్ ఒక్కరే కాదు అంతా కలసి రావాలి.అదేవిధంగా సినిమా మార్కెటింగ్ కు ఇంకొన్ని టెక్నిక్స్ అవలంబించాలి.అప్పుడు నాలుగు రూపాయలు నిర్మాతకు వచ్చి చేరుతాయి.టికెట్ ధర సరే మరి!క్యాంటీన్ రేట్ల మాటేంటి? వాటిపై నియంత్రణ ఉంచాల్సిందే! అప్పుడే అన్నీ కుదిరాయి అని అనుకునేందుకు, అంతా దార్లోకి వచ్చారని చెప్పుకునేందుకు,ఓ ప్రభుత్వం సమర్థనీయ ధోరణి ఇది అని చాటింపు వేసేందుకు,నిర్థారణ చేసేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయి.