తిరుమల తిరుపతి దేవస్థానం దైవ ద్రోహానికి పాల్పడుతోంది. త్పపుడు సమాచారంతో పుస్తకాలు ముద్రించి  ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. ... ఈ మాటలు అన్నది. ఈ విమర్శలు చేసింది ఏ ఇతర మతస్తుడో కాదు. ఒక స్వామీజీ.   టిటిడి అమలు చేస్తున్న పనులపై ఆయన  నిప్పులు చెరిగారు. ఇంతకీ అసలక్కడ ఏం జరిగింది ?


తిరుమల కొండలలో భాగంగా ఉన్న అంజనాద్రి పర్వతం హనుమంతుని జన్మస్థలమని పేర్కోంటూ తిరుమల తిరుపతి దేవస్థానం  పాలక మండలి గతంలో ప్రకటించింది. ఇందుకు సంబంధించిన భౌగోళిక, పౌరాణిక, శాస్త్రీయ ఆధారాలతో ఒక పుస్తకాన్ని ముద్రించింది. అంతటితో ఆగక ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు సంకల్పించిది.. ఇందులో భాగంగా అంజనాద్రి కొండ పైన కొంత భాగాన్ని సుందరీకరణ చేసేందుకు ఈ నెల 16న భూమి పూజ చేసేందుకు టిటిడి యంత్రాంగం సమాయత్తమైంది. ఆంజనాసుతుని జన్మవృత్తాంతం పై పుస్తం కూడా అదే రోజున విడుదల చేయనున్నట్లు టిటిడి ప్రకటించింది.ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా పేరున్న విశాఖ శారదా పీఠం పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి, అయోధ్యలోని  శ్రీరా మజన్మభూమి ఆలయ ట్రస్టు ట్రెజరర్ గోవింద్ దేవ్ గిరి స్వామి, ఇతర ఆధ్యాత్మిక ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గోంటున్నట్లు టిటిడి ప్రకటించింది.
దీంతో వివాదం మరలా ఆరంభమైంది. గతంలో అంజనాద్రి పర్వతం హనుమంతుని జన్మస్థలం అని టిటిడి ప్రకటించినపుడు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది. కొంత కాలానికి అది సద్దుమణిగింది. టిటిడి తాజాగా అంజనాద్రి కోండ పై అభివృద్ధి పనులకు పూనుకోవడంతో పాటు, పుస్తకాన్ని కూడా ముద్రించి ఆవిష్కరించనున్నట్లు ప్రకటించడంతో మరోసారి వివాదం రాజుకుంది.

కర్ణాటకకు చెందిన హనుమత్  జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వ్యవస్థాపక ట్రస్టీ  గోవిందానంద సర్వస్వతి స్వామీజి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చర్యలను తప్పు పడుతూ మీడియా సమావేశం నిర్వహించారు. టిటిడి ప్రజలను, స్వామీజీలను తప్పుదోవ పట్టిస్తున్నదంటూ విమర్శలు చేశారు. కర్ణాటక రాష్ట్రం లోని కిక్కింధ వద్ద నున్న పంపానది క్షేత్రం వద్దనే  ఆంజనాసుతుడు జన్మించాడని పేర్కోన్నారు. ఈ విషయాన్ని గతంలో చాలా మార్లు  టిటిడి దృష్టికి తీసుకువెళ్లామని కూడా ఆయన తెలిపారు. టిటిడి దైవద్రోహానికి పాల్పడుతోందని ఆరోపించారు. తప్పుడు సమాచారంతో పుస్తకాలు ముద్రించి పంపిణీ చేయడానికి సిద్దమైందన్నారు. సనాతన ధర్మానికి టిటిడి నే విఘాతం కలిగించడం శోచనీయమన్నారు. కిష్కింధ అభివృద్ధికి కర్ణాటక ప్రభుత్వం 12 వందల కోట్ల రూపాయలు కేటాయించినదని గోవిందానంద సరస్వతి స్వామీజీ తెలిపారు. హనుమత్  జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆద్వర్యంలో 12 సంవత్సరాల పాటు దేశ వ్యాప్తంగా రథయాత్ర చేస్తామని గోవిందానంద సరస్వతి పేర్కోన్నారు. కిష్కింధ మాత్రమే హనుమంతుని జన్మస్థలమని ప్రచారం చేస్తామని ఆయన తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ttd