మంత్రి పదవి..రాజకీయాల్లో ఏ నాయకుడుకైన పెద్ద పదవి...అందరికీ సీఎం అయ్యే అదృష్టం ఉండదు...కానీ సీఎం తర్వాత స్థాయిలో ఉండే మంత్రి అయ్యే అవకాశం చాలమందికి వస్తుంది. మంత్రి పదవి దక్కించుకుంటే చాలు ఆ నాయకుడు స్థాయి ఇంకా పెరుగుతుంది...అందుకే ఏ నాయకుడైన మంత్రి పదవి కోసం ఆశపడుతుంటారు. ఇప్పుడు ఏపీలో కూడా చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రి పదవిపై ఆశపెట్టుకున్నారు. ఎలాగైనా పదవి దక్కించుకోవాలని చూస్తున్నారు.

కొంతమంది అయితే ఇదే చివరి ఛాన్స్ అన్నట్లు ప్రయత్నాలు చేస్తున్నారు..ఎందుకంటే ఇప్పటికే కొంతమందికి వయసు మీద పడింది...అలాంటి వారు ఇంకా ఎక్కువసార్లు పోటీ చేయడానికి అవకాశాలు రావు..అదే సమయంలో నెక్స్ట్ గెలుస్తారో లేదో చెప్పలేని పరిస్తితి..సరే ఎలాగోలా ఎమ్మెల్యేగా గెలిచిన వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందో రాదో చెప్పలేని పరిస్తితి...ఇలా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి..అందుకే మళ్ళీ మంత్రి పదవి వస్తుందో రాదో తెలియదు...ఇప్పుడంటే వైసీపీ అధికారంలో ఉంది...పైగా ఎమ్మెల్యే పదవి ఉంది..కాబట్టి ఇప్పుడే మంత్రి పదవి దక్కించుకోవాలని చాలా ఆతృతగా ఉన్నారు.

అలా మంత్రి పదవి చివరి ఛాన్స్ అన్నట్లు ట్రై చేస్తున్న వారిలో పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా ఒకరు..ఈయన చిత్తూరు జిల్లా రాజకీయాల్లో సీనియర్ నాయకుడు..గతంలో టీడీపీలో పనిచేశారు..వరుసగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. ఏదో ఒకసారి మాత్రం ఎమ్మెల్యేగా గెలిచారు.

కానీ వైసీపీలోకి వచ్చాక ఈయన లక్ మారింది...2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు...2014లో ఎలాగో వైసీపీ అధికారంలోకి రాలేదు..కానీ 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక మంత్రి పదవిపై బాగానే ఆశలుపెట్టుకున్నారు. మొదట విడత ఎలాగో పదవి రాలేదు...ఈ సారి మాత్రం పదవి దక్కించుకోవాలని చూస్తున్నారు.  కాకపోతే వైసీపీలో రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు ఎక్కువ..దీంతో మంత్రి పదవి అనేది ఈజీగా దొరకదు. ఎక్కువమంది రెడ్డి ఎమ్మెల్యేలని క్యాబినెట్‌లోకి తీసుకోవడం సాధ్యపడదు. పైగా జిల్లాల వారీగా సమీకరణాలు చూసుకోవాలి. చూడాలి మరి ఈ సారి చింతలకు ఛాన్స్ వస్తుందో లేదో.


మరింత సమాచారం తెలుసుకోండి: